ICC One Day World Cup 2023 : ఈసారి పస లేదు.. అన్నీ వార్ వన్ సైడ్ మ్యాచ్‌లే.. పరమ బోరింగ్.. అంటున్న క్రికెట్ ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ICC One Day World Cup 2023 : ఈసారి పస లేదు.. అన్నీ వార్ వన్ సైడ్ మ్యాచ్‌లే.. పరమ బోరింగ్.. అంటున్న క్రికెట్ ఫ్యాన్స్

ICC One Day World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఎలా ఉండాలి చెప్పండి. క్షణక్షణం ఉత్కంఠ రావాలి. కానీ.. ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్‌లలో అంత సీన్ లేదు. దానికి కారణం.. ఏ మ్యాచ్ చూసినా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సాగుతున్నాయి. ముందే విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అయిపోయాక ఇక మ్యాచ్ చూస్తే ఏంటి.. చూడకపోతే ఏంటి. ప్రతి మ్యాచ్ అలాగే సాగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 October 2023,2:00 pm

ICC One Day World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఎలా ఉండాలి చెప్పండి. క్షణక్షణం ఉత్కంఠ రావాలి. కానీ.. ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్‌లలో అంత సీన్ లేదు. దానికి కారణం.. ఏ మ్యాచ్ చూసినా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సాగుతున్నాయి. ముందే విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అయిపోయాక ఇక మ్యాచ్ చూస్తే ఏంటి.. చూడకపోతే ఏంటి. ప్రతి మ్యాచ్ అలాగే సాగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం నిస్తేజులవుతున్నారు. బాబోయ్.. ఇవేం మ్యాచులురా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. అవును.. నిన్న కాక మొన్న జరిగిన దాయాదుల పోరు కూడా అంతే కదా. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎలా జరగాలి. ప్రతి క్షణం ఒక ఉత్కంఠ పరిస్థితి కలగాలి. కనురెప్ప కూడా వేయకుండా ఏం జరుగుతుందా? అని క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోవాలి. కానీ.. అక్కడ జరిగింది వేరు. వార్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భారత్ చిరకాల ప్రత్యర్థితో ఆడే ఆటలో కూడా పస లేదు అంటూ ఊసురుమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

వరల్డ్ కప్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే అదే జరిగింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జసరిగింది. అది కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సాగింది. ఇక.. ఇంగ్లండ్ అప్ఘనిస్తాన్, భారత్ ఆస్ట్రేలియా, భారత్ అఫ్ఘనిస్థాన్, భారత్ పాకిస్థాన్ ఇలా.. ప్రతి మ్యాచ్ అంతే. పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ మాత్రమే కాస్త ఎంటర్ టైన్ మెంట్ అందించిందని చెప్పుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లలో ఈ టోర్నీలోనే భారత్ పాక్ పోరు మాత్రమే అత్యంత పేలవంగా సాగింది. ఇదివరకు మ్యాచ్ లు చూస్తే భారత్, పాక్ మధ్య భీకరయుద్ధమే సాగిందని చెప్పుకోవచ్చు.

cricket fans are not happy with icc one day world cup 2023

#image_title

ICC One Day World Cup 2023 : టీ20 కి అలవాటు పడ్డారా?

ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్ లు రావడం, టీ20 ఫార్మాట్స్ రావడంతో ఆటగాళ్లు కూడా 20 ఓవర్ల మ్యాచ్ కే అలవాటు పడినట్టు కనిపిస్తోంది. 50 ఓవర్లు అనేసరికి.. అన్ని ఓవర్లు కంటిన్యూగా ఫామ్ లో ఉండి ఆడలేకపోతున్నారు. టీ20 ఫార్మాట్ కే అలవాటు పడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. 50 ఓవర్ల వరకు అదే ఫామ్ ను మెయిన్ టెన్ చేయలేకపోతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది