SuryaKumar Yadav : నా భార్యే నాకు బలం.. రోజూ అరగంట పాటు అది ఉండాల్సిందే.. అప్పుడే ఆట సరిగ్గా ఆడగలుగుతా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SuryaKumar Yadav : నా భార్యే నాకు బలం.. రోజూ అరగంట పాటు అది ఉండాల్సిందే.. అప్పుడే ఆట సరిగ్గా ఆడగలుగుతా

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2022,7:40 pm

SuryaKumar Yadav : ప్రస్తుతం టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ తన సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించుకున్నా.. సూర్యకుమార్ యాదవ్.. హాఫ్ సెంచరీల మోత మోగించాడు. అదే జోరుతో న్యూజిలాండ్ పర్యటనలోనూ ఆడుతున్నారు. నిన్న ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అయితే.. సూర్యకుమార్ యాదవ్.. అంత జోరుగా ఆడటానికి..

సూపర్ ఫామ్ లో ఉండటానికి కారణం ఏంటి అని సూర్యకుమార్ యాదవ్ ను మీడియా ప్రశ్నించింది. దీంతో దానికి కారణం.. తన భార్య దెవిషా శెట్టి అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. తన భార్య ఎప్పుడూ తనతోనే ఉంటుందని.. తను పక్కన ఉండటం వల్ల ఎలాంటి స్ట్రెస్ ఉండదని చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అలాగే.. తను ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతానని.. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటానని చెప్పాడు. ప్రతి రోజు ఓ అరగంట పాటు తన తల్లిదండ్రులతో సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా మాట్లాడుతాడట. తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడట.

cricketer SuryaKumar Yadav talks about spending time with his family

cricketer SuryaKumar Yadav talks about spending time with his family

SuryaKumar Yadav : మ్యాచ్ లేకపోతే షికారుకు

అలాగే.. తను ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. ఎక్కడ క్రికెట్ ఆడినా తన సతీమణిని వెంట తీసుకెళ్తాడట. క్రికెట్ ఆడటం పూర్తయ్యాక.. ఖాళీ టైమ్ దొరికితే తన భార్యతో గడుపుతాడట. ఒకవేళ ఎలాంటి మ్యాచ్ లేకపోతే తన భార్యను తీసుకొని షికారుకు వెళ్తాడట సూర్యకుమార్ యాదవ్. ప్రతి రోజు తన లైఫ్ లో జరిగేది ఇదేనట. అందుకే.. తన లైఫ్ చాలా ప్రశాంతంగా ఉందని.. ఆట నిలకడగా ఆడటానికి అదే తోడ్పడుతోందని చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అలాగే.. టీమిండియాలో విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడమంటే సూర్యకుమార్ యాదవ్ కు చాలా ఇష్టమట.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది