MS Dhoni : ఏంటి.. ధోని ఆమెని అలా ఏడిపించేశావు.. వీడియో !
ప్రధానాంశాలు:
MS Dhoni : ఏంటి.. ధోని ఆమెని అలా ఏడిపించేశావు.. వీడియో !
MS Dhoni : అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆటని ఆస్వాదించేందుకు గ్రౌండ్‌కి భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారు. అయితే మహీ ఏమాత్రం.. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా, లేదంటే ఔటైన కూడా ఫ్యాన్స్ బోరున ఏడుస్తారు. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో లేడీ ఫ్యాన్ ధోనీ దెబ్బకు విలవిలలాడేలా ఏడ్చింది.

MS Dhoni : ఏంటి.. ధోని ఆమెని అలా ఏడిపించేశావు.. వీడియో !
MS Dhoni అలా ఏడిపించావు..
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఐదో స్థానంలో వచ్చాడు కానీ ఆశించినంత స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడు.. 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేటుతో 1 ఫోర్, 3 సిక్సుల సాయంతో 27 పరుగులు చేశాడు. కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి కాస్త ఆశలు రేపినా కూడా.. చివరి ఓవర్లో మహీ ఔటైపోయాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో చాహల్ చేతికి చిక్కి ఔటైపోయాడు.
43 ఏళ్ల వయసులోనూ మహీ బానే ఆడుతున్నాడంటూ ఓవైపు చర్చించుకుంటుండగానే అతను ఔటయ్యాడు. దాంతో ఓ మహిళా అభిమాని బోరున విలపించింది. ఇతర సీఎస్కే అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. అందరి ముఖాలు వెలవెలబోయాయి. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) పరుగులతో రాణించిన కూడా సీఎస్కే విజయం సాధించలేకపోయింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.
THALA! ™
In the slot & #MSDhoni wastes no time in dispatching it into the stands! 💛
Watch the LIVE action ➡ https://t.co/tDvWovyffE#IPLonJioStar 👉 #PBKSvCSK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/ojCO0jH1GN
— Star Sports (@StarSportsIndia) April 8, 2025