
#image_title
Disney Hotstar : ఇండియన్స్ కు క్రికెట్ అంటే ఎంత అభిమానమో తెలుసు కదా. భారత్ లో కొన్ని కొట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. అందులోనూ దాయాదుల పోరు అంటే ఇక ఆరోజు ఎలాంటి పనులు ఉన్నా ఖచ్చితంగా అన్నీ వాయిదా వేసుకొని మరీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడాల్సిందే. చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ అంటే.. అన్ని రికార్డులు బద్దలు కావాల్సిందే. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లోనూ అదే జరిగింది. ఈ మ్యాచ్ ప్రసారం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు అని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల వ్యూయర్ షిప్ కేవలం ఈ మ్యాచ్ కే దక్కింది. ఇప్పటి వరకు డిస్నీ హాట్ స్టార్ చరిత్రలో ఇన్ని వ్యూస్ ఎప్పుడూ రాలేదు. అందుకే ఇది ఆల్ టైమ్ రికార్డుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పష్టం చేసింది. అసలే వన్డే ప్రపంచ కప్.. అందులోనూ భారత్, పాక్ మ్యాచ్. అందుకే ఇప్పటి వరకు హాట్ స్టార్ పేరు మీద ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఒక హైఓల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ కి భారీ స్థాయిలో హాట్ స్టార్ లో వ్యూస్ వచ్చాయి. ఈ మ్యాచ్ కు ఏకంగా 3 కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయట. అది కూడా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రికార్డు అయ్యాయట. నిజానికి నిన్నటి మ్యాచ్ లో భారత్ గెలుపు ముందే ఖాయం అయింది. ఎందుకంటే.. పాకిస్థాన్ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. చాలా స్వల్ప స్కోర్ నే భారత్ కు నిర్దేశించింది. అయినా కూడా భారత్ బ్యాటింగ్ సమయంలో అది కూడా రోహిత్ శర్మ చెలేరేగి మరీ ఆడిన ఆయన బ్యాటింగ్ సమయంలో ఎక్కువ వ్యూస్ వచ్చాయట. మ్యాచ్ మొత్తం 3 కోట్లకు తగ్గకుండా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే 3 కోట్ల మంది భారతీయులు కేవలం హాట్ స్టార్ లోనే మ్యాచ్ చూశారన్నమాట.
#image_title
ఆసియా కప్ లోనూ భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో 2 కోట్ల 80 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు అవే అత్యధిక వ్యూస్ గా నమోదయ్యాయి. కానీ.. వరల్డ్ కప్ మ్యాచ్ లో మళ్లీ అదే పాక్, భారత్ మ్యాచ్ లో వ్యూస్ రికార్డును చెరిపేసి 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చి హాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. నిజానికి హాట్ స్టార్ కు ఇన్ని వ్యూస్ రావడానికి కారణం.. ఈసారి ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే హాట్ స్టార్ లో మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది హాట్ స్టార్.
అంటే.. సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అవసరం లేదు. కేవలం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నా, లేదా వెబ్ లో హాట్ స్టార్ వెబ్ సైట్ లోకి వెళ్లి మ్యాచ్ ను ఫ్రీగా చూడొచ్చు. లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఈసారి అన్ని కోట్ల వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.