RCB : ఆర్సీబీ 17 ఏళ్ల కల నెరవేరుతుందా.. కష్టమే అని చెబుతున్న కాలుక్యులేషన్స్
ప్రధానాంశాలు:
RCB : ఆర్సీబీ 17 ఏళ్ల కల నెరవేరుతుందా.. కష్టమే అని చెబుతున్న కాలుక్యులేషన్స్
RCB : ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దర్జాగా ఫైనల్ చేరింది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో తొలి టైటిల్ గెలవడానికి ఆర్‌బీసీ కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. దీంతో 17 ఏళ్ల కల జూన్ 3న నెరవేరుతుందా లేదా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్వాలిఫయర్-2 జూన్ 1న ముంబై వర్సెస్ పంజాబ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది బెంగళూరుతో తలపడుతుంది.

RCB : ఆర్సీబీ 17 ఏళ్ల కల నెరవేరుతుందా.. కష్టమే అని చెబుతున్న కాలుక్యులేషన్స్
RCB ఏం చేస్తారో..
రజత్ పాటిదార్ సేన 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు జట్టు తన మొదటి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. చివరి బంతి వేసే వరకు ఏమీ జరుగుతుందో చెప్పలేమని చెబుతుంటారు. ఆర్‌సీబీ ఫామ్, జట్టు ఆటగాళ్లను పరిశీలిస్తే ఈ సంవత్సరం తన తొలి టైటిల్‌ను గెలుచుకోగలదనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ, బెంగళూరు అలా చేయడంలో విఫలం కావొచ్చు.
గతంలో కూడా ఆర్సీబీకి మూడు సార్లు అవకాశాలు వచ్చాయి. కానీ మూడుసార్లు ఫైనల్స్‌లో ఓడిపోయి ఫ్యాన్స్‌ని కూడా నిరాశపరిచింది. టోర్నమెంట్ అంతటా బాగా రాణిస్తుంది కానీ, టైటిల్ మ్యాచ్‌లో ఆ ఉత్సాహాన్ని కోల్పోతుంది. ఈసారి కూడా ఇలాంటిదే చేస్తుందా లేదంటే రికార్డ్ బ్రేక్ చేయడం చూస్తామా? అనేది చూడాలి.. ఫైనల్ మ్యాచ్ గణాంకాలు మాత్రం బెంగళూరుకు అనుకూలంగా లేవు. ఫైనల్‌లో 2009లో డీసీతో ఓడిన ఆర్సీబీ, ఆ తర్వాత 2011లో చెన్నైతో 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఓటిమి పాలైంది. ఈ సారి ఫైనల్‌కి ఏ జట్టు వస్తుంది, వారిపై గెలుస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.