Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్ – ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!
ప్రధానాంశాలు:
తప్పంతా నా భార్యదే - చాహల్
Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్-ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న అభిప్రాయభేదాల కారణంగా వారు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి బంధం, విడిపోవడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తాజాగా విడాకుల తర్వాత ఈ ఇద్దరి మధ్య పరోక్షంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఒకరొకొకరు స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది వారి విడాకుల వివాదాన్ని మరింత రాజేస్తోంది.

Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్-ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!
Chahal మొత్తం నా భార్యే చేసింది – చాహల్
విడాకుల తర్వాత ధనశ్రీ దుబాయ్‌కి వెళ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అక్కడి ప్రశాంతతను ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ముఖ్యంగా దుబాయ్ నగరం సంస్కృతి, మత సామరస్యాన్ని ఎలా గౌరవిస్తుందో వివరిస్తూ, అక్కడ ఉన్న హిందూ దేవాలయాన్ని సందర్శించి మనశ్శాంతి పొందినట్లు ఆమె పేర్కొంది. ఈ పోస్టులు నెటిజన్లలో ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల గురించి మరింత చర్చకు దారితీశాయి.
మరోవైపు ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చాహల్ తమ విడాకులకు పరోక్షంగా ధనశ్రీ వైపు నుంచే తప్పు జరిగిందని సూచించారు. తొలుత ఈ విషయాలపై స్పందించకూడదనుకున్నానని, కానీ ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. చాహల్ వ్యాఖ్యల అనంతరం ధనశ్రీ ప్రశాంతమైన, ఆధ్యాత్మిక పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టును చాహల్‌కు పరోక్షంగా సమాధానంగా నెటిజన్లు భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, వారి సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నాయి.