Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకోగా, ఆ స‌మ‌యంలో అత‌నిని కొంద‌రు ‘మోసగాడు’గా అభివర్ణించారు .నిజానికి, మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఏం జరిగిందో కొంతమందికి అసలేం తెలీదు. అయినా వారు నన్నే తప్పుపట్టారు” అని చాహల్ చెప్పాడు.

Cricketer న‌న్ను మోస‌గాడు అన్నారు ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా క్రికెట‌ర్‌ కామెంట్స్

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : క‌ఠిన ప‌రిస్థితులు…

మేమిద్దరం కూడా మా కెరీర్‌లో విజయాన్ని సాధించాలనుకున్నాం. అదే కారణంగా, వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వడం కష్టంగా మారింది. ఒక దశలో భావోద్వేగ సంబంధాలు కూడా సడలిపోయాయి. ఆ ప్రభావం రిలేషన్‌పై పడక తప్పదు. కెరీర్‌ కీలక దశలో భాగస్వామికి సమయం కేటాయించడం కష్టం అవుతుంది. అలాంటి సమయంలో ఇతరులు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మద్దతుగా నిలవడం అత్యంత అవసరం” అని ఆయన వివరించాడు.

విడాకులు తీసుకున్న తర్వాత నా మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయే స్థితికి చేరుకున్నాను. ఇలా 45 రోజులు గడిచాయి. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఏ విషయం మీదా ధ్యాస పెట్టలేకపోయాను. సుమారు ఐదు నెలల పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో వున్నాను. కొన్నిసార్లు నా అత్యంత సన్నిహిత మిత్రుడితో ఆత్మహత్య ఆలోచనలు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది నిజంగా భయానకమైన అనుభవం” అని చాహల్ భావోద్వేగంగా వెల్లడించాడు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది