Hardik Pandya : హార్ధిక్ పాండ్యా విడాకులు నిజ‌మేనా.. ఆస్తిలో 70 శాతం వాటా అడిగిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా విడాకులు నిజ‌మేనా.. ఆస్తిలో 70 శాతం వాటా అడిగిందా?

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,1:30 pm

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. పార్టీలో ఏర్ప‌డిన పరిచ‌యం ప్రేమ‌గా మారి, ఆ త‌ర్వాత రెండేళ్ల‌పాటు డేటింగ్ చేసి త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త సంచ‌ల‌నం సృష్టించింది. అయితే హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుక‌న్నార‌ని టాక్ న‌డుస్తుంది. ఇటీవల నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు ఊతం అందించింది.

నిజమెంత‌?

ఇన్‌స్టాలో కేవలం కుమారుడితో తాను ఉన్న చిత్రాలను మాత్రమే ఆమె ఉంచింది. యూజర్‌నేమ్‌లో పాండ్య అనే పదాన్ని కూడా తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వదంతులు మొదలయ్యాయి. నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో భరణం అధికంగా అడిగే అకవాశాలు ఉన్నాయని న్యాయ నిపుణలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని సమాచారం.

Hardik Pandya హార్ధిక్ పాండ్యా విడాకులు నిజ‌మేనా ఆస్తిలో 70 శాతం వాటా అడిగిందా

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా విడాకులు నిజ‌మేనా.. ఆస్తిలో 70 శాతం వాటా అడిగిందా?

ఇదే సమయంలో నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు ‘ఒకరు రోడ్డున పడబోతున్నారు’ అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి ఐపీఎల్‌ జరిగే సమయంలో నటాషా కన్పించలేదు. ముంబై ఆడే మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియానికి రాలేదు. ముంబై ఇండియన్స్‌, హార్దిక్‌ పాండ్యాకు మద్దతుగా పోస్టులు సైతం చేయలేదు. ఇదే సమయంలో మార్చి 4న నటాషా పుట్టినరోజు సందర్భంగా హార్దిక్‌ పాండ్యా విష్‌ చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ విడాకుల ప్రచారానికి బలాన్నిస్తున్నాయి!

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది