Hardik Pandya : ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్.. అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hardik Pandya : ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్.. అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్

Hardik Pandya : ప్ర‌స్తుత ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నిత్యం నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ఎప్పుడైతే అత‌ను రోహిత్ శ‌ర్మ‌ని త‌ప్పించి ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ అయ్యాడో అప్ప‌టి నుండి అత‌నిని ఏదో ర‌కంగా విమర్శిస్తూనే ఉన్నారు.బ‌య‌ట‌, గ్రౌండ్‌లో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, ఆట తీరు ఇలా ప్ర‌తి విష‌యంలో కూడా హార్ధిక్ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. అయితే రీసెంట్‌గా హార్ధిక్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ కాగా, ఇందులో హార్ధిక్ తీరుని ఎండ‌గ‌డుతున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Hardik Pandya : ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్.. అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్

Hardik Pandya : ప్ర‌స్తుత ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నిత్యం నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ఎప్పుడైతే అత‌ను రోహిత్ శ‌ర్మ‌ని త‌ప్పించి ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ అయ్యాడో అప్ప‌టి నుండి అత‌నిని ఏదో ర‌కంగా విమర్శిస్తూనే ఉన్నారు.బ‌య‌ట‌, గ్రౌండ్‌లో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, ఆట తీరు ఇలా ప్ర‌తి విష‌యంలో కూడా హార్ధిక్ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. అయితే రీసెంట్‌గా హార్ధిక్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ కాగా, ఇందులో హార్ధిక్ తీరుని ఎండ‌గ‌డుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్… పంజాబ్ కింగ్స్‌తో ప‌డేందుకు ముంబై నుంచి ముల్లాన్‌పుర్‌కు జట్టుతో కాకుండా ఒంటరిగా వెళ్ళాడు.

Hardik Pandya ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్ అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్

Hardik Pandya : ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్.. అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్

Hardik Pandya : అంత ఓవ‌ర్ యాక్ష‌న్ ఎందుకు?

అయితే కాస్త ఉక్క‌పోత అనిపించ‌డంతో హార్ధిక్ త‌న జాకెట్‌ని విప్పి సెక్యూరిటీకి ఇచ్చాడు.ఇది చూసిన నెటిజ‌న్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోవాలని హార్దిక్‌కు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఎలా ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. జాకెట్ మోయడానికి ఒకరు.. లగేజి తీసుకురావడనికి మరోకరు.. ఇన్ని ఎక్స్‌ట్రాలు నీకు అవసరమా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి నువ్వు త‌గ్గించుకోక‌పోతే కెరీర్ కూడా క‌లాస్ అవుతుంద‌ని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (78), రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ(34) రాణించడంతో అంత స్కోరు సాధించ‌గ‌లిగింది.

Hardik Pandya ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్ అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్

Hardik Pandya : ఇవే త‌గ్గించుకుంటే మంచిది హార్ధిక్.. అంత బలుపు ఏంట్రా నీకు అంటూ ఫైర్

అయితే ఈ మ్యాచ్‌లో కూడా హార్ధిక్ పాండ్యా నిరాశ‌ప‌రిచాడు. కాక‌పోతే మిగ‌తా ప్లేయ‌ర్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టు విజ‌యం సాధించింది ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో విజయం. మరోవైపు పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో 5 ఓడిపోయింది. ముంబై ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే త‌ప్ప‌నిసరి గెల‌వాల్సిన ప‌రిస్థితి అయింది. ఇప్ప‌టికే స‌గం మ్యాచ్‌లు పూర్తి కాగా హార్ధిక్ బౌలింగ్‌, బ్యాటింగ్‌లో ఏ మాత్రం ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌లేదు. త‌ర్వాతి మ్యాచ్‌లు కూడా స‌రిగ్గా ఆడ‌క‌పోతే అత‌ను టీ20 ప్ర‌పంచ క‌ప్‌కి కూడా ఎంపిక కావ‌డం క‌ష్ట‌మే

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది