Hardik Pandya : క్రికెట్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఐసీసీ వరల్డ్ కప్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్.. టెన్షన్‌లో టీమిండియా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hardik Pandya : క్రికెట్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఐసీసీ వరల్డ్ కప్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్.. టెన్షన్‌లో టీమిండియా

Hardik Pandya : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూ మధ్యలో కాలు స్లిప్ అయి కింద పడి తన ఎడమ కాలు మణికట్టు బెనికి హార్ధిక్ పాండ్యా అక్కడే కుప్పకూలిన విషయం తెలుసు కదా. ఆయన మూడు బంతులు వేసి మరో బంతి కూడా వేయలేకపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యాను వెంటనే స్టేడియం నుంచి బయటికి తీసుకెళ్లి స్కానింగ్ కోసం పంపించారు. మిగిలిన మూడు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 October 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  ఇంగ్లండ్ మ్యాచ్‌కి దూరం అయినట్టేనా?

  •  పాండ్యా ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు?

  •  టీమిండియాకు ఇంగ్లండ్ తో మ్యాచ్ సవాల్ గా మారినట్టేనా?

Hardik Pandya : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూ మధ్యలో కాలు స్లిప్ అయి కింద పడి తన ఎడమ కాలు మణికట్టు బెనికి హార్ధిక్ పాండ్యా అక్కడే కుప్పకూలిన విషయం తెలుసు కదా. ఆయన మూడు బంతులు వేసి మరో బంతి కూడా వేయలేకపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యాను వెంటనే స్టేడియం నుంచి బయటికి తీసుకెళ్లి స్కానింగ్ కోసం పంపించారు. మిగిలిన మూడు బంతులు కూడా పేసర్ విరాట్ కోహ్లీ వేశాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది కానీ.. హార్దిక్ లేని లోటు మాత్రం స్పష్టంగా టీమిండియాకు తర్వాత తెలిసి వచ్చింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లేక టీమిండియా సతమతమైంది. ఏదో షమీ ఎక్కువ వికెట్లు తీయడం వల్ల భారత్ ఆ మ్యాచ్ గెలిచింది కానీ.. లేకపోతే ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది.

కనీసం ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో అయినా పాండ్యా కోలుకొని తిరిగి వస్తాడు అని క్రికెట్ అభిమానులు, టీమిండియా అనుకుంది. కానీ.. ఇంగ్లండ్ మ్యాచ్ లోనూ హార్ధిక్ పాండ్యా ఆడే సూచనలు అయితే కనిపించడం లేదు. హార్ధిక్ పాండ్యా లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ ను మేనేజ్ చేయడం టీమిండియాకు సవాల్ గా మారింది. న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎలాగోలా నెట్టుకొచ్చారు. కానీ.. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మాత్రం పాండ్యా లేని లోటును టీమిండియా ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతోంది. అదొక్కటే కాదు.. వచ్చే రెండు మ్యాచ్ లలో పాండ్యా ఆడే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అంటే.. చివరి రెండు లీగ్ మ్యాచ్ లలో మాత్రమే పాండ్యా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ తో భారత్ ఆడబోయే మ్యాచ్ లలో మాత్రమే హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

hardik pandya will not play two more matches due to injury

#image_title

Hardik Pandya : మరి ఈ రెండు మ్యాచ్ ల పరిస్థితి ఏంటి?

త్వరలో లక్నోలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో అన్నింటిలో భారత్ విజయం సాధించింది. సొంత గడ్డపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది భారత్. కానీ.. ఇదే కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉండాలి. వైస్ కెప్టెన్, పేసర్, ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తదుపరి రెండు మ్యాచ్ లకు మిస్ అవుతుండటంతో టీమిండియాలో సరికొత్త టెన్షన్ స్టార్ట్ అయిందట. హార్ధిక్ పాండ్యా కోలుకోవడానికి ఇంకో 10 రోజుల సమయం పడుతుందట. అప్పటి వరకు మరో రెండు లీగ్ మ్యాచ్ లు పూర్తవుతాయి. ఆ తర్వాత మాత్రమే భారత జట్టులో పాండ్యా కొనసాగనున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది