India Vs Bangladesh : బంగ్లాదేశ్ చేతిలో గెలిచే మ్యాచ్ భారత్ వైపు తిప్పేలా చేసిన హైలెట్ త్రో వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India Vs Bangladesh : బంగ్లాదేశ్ చేతిలో గెలిచే మ్యాచ్ భారత్ వైపు తిప్పేలా చేసిన హైలెట్ త్రో వీడియో..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :3 November 2022,2:50 pm

India Vs Bangladesh : T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా టీం దూసుకుపోతోంది. గ్రూప్ వన్ లో జరిగిన నాలుగు మ్యాచ్లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా… సాగిన సంగతి తెలిసిందే. విజయం ఎవరికి వరిస్తుందో అన్నది చివరి బంతి వరకు దోబూచులాటాడింది. చివర ఆఖరికి ఎంజాయ్ గెలవడం జరిగింది. మధ్యలో వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. బంగ్లాదేశ్ గెలిచే పరిస్థితి మధ్యలో నెలకొంది.

కానీ వర్షం తగ్గటం మళ్ళీ మ్యాచ్ మొదలవటంతో సీన్ మొత్తం మారిపోయింది. దీంతో పుంజుకున్న భారత్.. బౌలర్లు.. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లను ఒత్తిడిలోకి నెట్టేటంలో విజయం సాధించారు. వర్షం పడిన తర్వాత కీలక వికెట్లు తీశారు. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్ లో అసలైన టర్నింగ్ పాయింట్… 65 మీటర్ల దూరం నుండి వికెట్ల వైపు త్రో చేసిన ఒక బాల్… బంగ్లాదేశ్ చేతిలో ఉన్న మ్యాచ్ భారత్ వైపు తిరిగేలా చేసింది. రెండోసారి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ టీంలో లిటన్ దాస్ అద్భుతమైన అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడటం తెలిసిందే.

india vs bangladesh match highlight throw

india vs bangladesh match highlight throw

అయితే వర్షం పడిన తర్వాత ప్రారంభమైన మ్యాచ్ లో అశ్విన్ వేసిన రెండో బంతికి.. ఇద్దరు బ్యాట్స్ మెన్ లు.. ఒక పరుగు పూర్తి చేసి రెండో పరుగు తీస్తున్న క్రమంలో వచ్చిన కేఎల్ రాహుల్ 65 మీటర్ల దూరంలో.. డైరెక్ట్ గా.. అటాకింగ్ గేమ్ ఆడుతున్న లిటన్ దాస్ పరుగులు తీస్తున్న నాన్ స్ట్రైకర్ వైపు మంచి విసరటం అది నేరుగా వికెట్లు తాకటంతో… కీలకమైన వికెట్ పడిపోయింది. ఇదే భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్.. అని హైలెట్స్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది