IPL 2022 : ధోని కీపింగ్ ని గుర్తుచేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ వికేట్ కీపర్.. ఎవరో తెలిస్తే షాక్
IPL 2022 : మిస్టర్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీ టీం ఇండియా మాజీ సారథి. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. 14 ఏండ్లుగా సీఎస్ కే టీం సారథిగా ఉన్న ధోనీ కెప్టెన్సీ వదులుకున్నాడు. కాగా ధోనీని స్టంపౌట్ చేయాలంటే అంత సులువు కాదు. క్రీజు వెలుపలికి వెళ్లినట్లు కనిపించే ధోనీ బంతి మిస్ అవగానే ఒక పాదాన్ని మాత్రం చాలా వేగంగా మళ్లీ క్రీజులో ఉంచుతుంటాడు.ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త వికెట్ కీపర్ షెల్డాన్ జాక్సన్ అదరగొట్టేశాడు. వికెట్ల వెనుక చాలా చురుగ్గా కదిలిన ఈ 35 ఏళ్ల కీపర్.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రాబిన్ ఉతప్పని మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు.
అదే జోరులో ధోనీ స్టంపింగ్ కోసం కూడా ప్రయత్నించాడు. కానీ.. ధోనీ తెలివిగా క్రీజులో పాదం ఉంచి స్టంపౌట్‌కి దొరకలేదు. అయినప్పటికీ.. జాక్సన్ పట్టు వదలకుండా స్టంపింగ్ కోసం ప్రయత్నిస్తూ కనిపించాడు.రాబిన్ ఉతప్పని స్టంపౌట్ చేసిన జాక్సన్ ధోనీ స్టంపౌట్ కోసం తీవ్ర ప్రయత్నం చేయడంతో నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మ్యాచ్‌లో చెన్నైని ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్. సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే కొత్త వికెట్ కీపర్ షెల్డాన్ జాక్సన్ అదరగొట్టేశాడు. సౌరాష్ట్రకి చెందిన షెల్డాన్ జాక్సన్‌ని కేవలం రూ.60 లక్షలకే ఐపీఎల్ 2022 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. శామ్ బిల్లింగ్స్ టీమ్‌లో ఉండటంతో.. అతడ్ని రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉంచుకుంటారని అంతా ఊహించారు. కానీ.. చెన్నైతో మ్యాచ్‌లో అతనికి కీపర్‌గా అవకాశం దక్కింది. దాంతో ఆ ఛాన్స్‌ని రెండుజేతులా జాక్సన్ ఉపయోగించుకున్నాడు.
IPL 2022 : కొత్త కీపర్ జాక్సన్ వేగంగా…
వరుస బౌండరీలు బాదుతున్న రాబిన్ ఉతప్ప (28: 21 బంతుల్లో 2×4, 2×6)ని స్టంపౌట్ చేయడంతో పాటు.. రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్ ధోనీ క్రీజు వెలుపలికి వెళ్లి ధైర్యంగా ఆడే అవకాశం ఇవ్వలేదు. వికెట్ల వెనుక చాలా యాక్టీవ్‌గా షెల్డాన్ జాక్సాన్ కనిపించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. ఐదో బంతిని గూగ్లీ రూపంలో సంధించాడు. కానీ.. ఆ బంతికి షాట్ ఆడేందుకు క్రీజు వెలుపలికి రాబిన్ ఉతప్ప వెళ్లగా.. లెగ్ సైడ్ వైడ్‌గా వెళ్లిన ఆ బంతిని ఉతప్ప కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. అయితే వికెట్ల వెనుక నుంచి వేగంగా ఆ బంతిని గూగ్లీగా గుర్తించిన జాన్సన్ బంతిని అందుకుని రెప్పపాటులో బెయిల్స్ ఎగరగొట్టేశాడు. దీంతో రాబిన్ ఉతప్ప కనీసం థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం వెయిట్ చేయకుండానే పెవిలియన్ వైపు నడిచాడు.
ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌కి రాగా మహేంద్రసింగ్ ధోనీ అతడ్ని ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని క్రీజు వెలుపలికి వెళ్లి డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసిన ధోనీ టర్న్‌ని ఊహించలేకపోయాడు. దాంతో బంతి అతని బ్యాట్ పక్క నుంచి నేరుగా కీపర్ జాక్సాన్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టంపౌట్ ప్రమాదం గ్రహించిన ధోనీ తెలివిగా పాదాన్ని క్రీజులో నుంచి గాల్లోకి లేపలేదు. ఆ ఓవర్‌లో మరోసారి కూడా జాక్సాన్ ధోనీ స్టంపౌట్ కోసం ట్రై చేశాడు. ధోనీని స్టంపౌట్ చేయలేకపోయినా.. రాబిన్ ఉతప్పని వేగంగా స్టంపౌట్ చేసిన జాన్సన్.. ఒకప్పటి ధోనీని గుర్తుకు తెచ్చాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.