IPL 2022: బ్రాండ్ నేమ్ వదులుకోండి.. ప్రాంచైజీ ఓనర్ కావ్యాపై అభిమానుల ఫైర్.. ఇలాగైతే ఎలా.. ఈ ప్రదర్శనతో ముందుకెళ్లగలరా..
IPL 2022: ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌లోనే చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్ ఆ తర్వాత పేలవ బ్యాటింగ్‌తో చెత్త రికార్డు మూటగట్టుకుంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో వంటి స్టార్ ఓపెనర్లను వదులుకున్న సన్‌రైజర్స్ ఆస్థాయి ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయకపోవడంతో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వరుసగా నో బాల్స్ సమర్పించారు. భువీ వేసిన మొదటి ఓవర్‌లో జోస్ బట్లర్ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు.
అయితే అది నో బాల్‌గా తేలడంతో బట్లర్ నాటౌట్‌గా తేలాడుఆ తర్వాత మూడో ఓవర్‌లోనూ మరో నో బాల్ వేశాడు భువనేశ్వర్ కుమార్. ఉమ్రాన్ మాలిక్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ నో బాల్ రాగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా నో బాల్ సమర్పించాడు. ఐదో ఓవర్లలోనే ఐదు నో బాల్స్ వేశారు సన్‌రైజర్స్ బౌలర్లు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాజస్థాన్ బ్యాటర్స్.అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, రొమారియో చెరో వికెట్ తీశారు. భువీ మినహా మిగిలిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించారు.
IPL 2022: భావోద్వేగాలతో ఆడుకోవద్దు..
గత సీజన్‌లో ఈజీ టార్గెట్‌ను ఛేజ్ చేయడానికే అపసోపాలు పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే కోట్లాదిమంది అభిమానుల భావోద్వేగాలతో సన్‌రైజర్స్ టీమ్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఆటలాడుకుంటోందని మండిపడుతున్నారు. తెలుగు ప్రజల ఎమోషన్స్‌ను అర్థం చేసుకోలేనప్పుడు, దాన్ని సీరియస్‌గా తీసుకోలేనప్పుడు హైదరాబాద్ బ్రాండ్‌నేమ్‌ను వదులుకోవాలని సలహా ఇస్తున్నారు.తెలుగు ప్రజలు మనోభావాలు, భావోద్వేగాలకు అనుగుణంగా జట్టును సెలెక్ట్ చేసుకోలేకపోయిందని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్‌పై భగ్గుమంటున్నారు. మెగా వేలంపాట సందర్భంగా- ఇతర ఫ్రాంఛైజీలు సూపర్ ప్లేయర్స్ అందరినీ ఎగరేసుకెళ్లారని, ఆ పని సన్‌రైజర్స్ చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు. ఫ్రాంఛైజీని హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీకి దాన్ని అమ్మేసుకోవాలని సూచించారు.
Pooran should change his name to NoRun ???????????? #SRHvsRR
— kingbingo (@kingobingo18) March 30, 2022