IPL 2022 : ఓవర్ త్రో లేకుండానే నాలుగు పరుగులు.. బట్లర్ భళా.. బౌండరీ అంచున ఆపినా వృథా..
IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. 20 ఓవర్లు ఆడిన సంజూ సేన 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అయితే జాస్ బట్లర్ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 61 బంతుల్లో 103 స్కోర్ తో ఈ సీజన్ లో రెండో సెంటరీ నమోదు చేసుకున్నాడు. దేవదత్ పడిక్కల్ 24, సంజుశాంసన్ 38 కీలక ఇన్సింగ్స్ ఆడగా షిమ్రాన్ 13 బంతుల్లో 26 తో మెరిశాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.కాగా 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతాకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం విశేషం.
అయితే భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు ఇన్నింగ్స్ ఆరంభంలో షాక్ తగిలింది. తొలి బంతికే సునీల్ నరైన్ (0) రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు బౌండరీలు బాదుతూ.. కోల్‌కతాను విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే ఫించ్, నితీష్ రాణా (18) అవుటైన తర్వాత కేకేఆర్ కష్టాల్లో పడింది. భారీ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (0) తొలి బంతికే డక్‌గా వెనుతిరిగాడు.ఆ తర్వాత 17వ ఓవర్లో యుజ్వేంద్ర చహల్ కోల్‌కతా విజయావకాశాలను దెబ్బతీశాడు. హ్యాట్రిక్ సహా మొత్తం నాలుగు వికెట్లు తీసిన చహల్.. కీలకమైన శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో రాజస్థాన్ జట్టు మళ్లీ పోటీలోకి వచ్చింది. అయితే 18వ ఓవర్లో ఉమేష్ యాదవ్ రెచ్చిపోవడంతో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు.
దాంతో కేకేఆర్ రేసులోకి వచ్చింది. చివరి ఓవర్ వేసిన మెక్‌కాయ్.. షెల్డాన్ జాక్సన్ (8), ఉమేష్ యాదవ్ (21)ను అవుట్ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఓవర్ త్రో లేకుండా నేరుగా వికెట్ల మధ్య పరుగెత్తి రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్ నాలుగు రన్స్ తీశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతిని బట్లర్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. బంతిని వెంటాడిన వెంకటేశ్ బౌండరీకి చేరువలో దానిని ఆపి వెనక్కి తోసేసాడు. బంతిని అందుకున్న రాణా కీపర్ వైపు విసిరాడు. అప్పటికే మూడు పరుగులు తీసిన బట్లర్ డైవ్‌తో నాలుగో పరుగు కూడా సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మీరు కూడా చూసి ఆనందించండి మరి…
https://twitter.com/Raj93465898/status/1516059598285062144?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516059598285062144%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fsakshi-epaper-sakshi%2Fipl2022naaluguparugettaarumirusupar-newsid-n378527392%3Fs%3Dauu%3D0x065620fec1343804ss%3Dwsp