Dhoni : ధోని ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. స‌న్ రైజర్స్‌తో మ్యాచ్‌కి మిస్ట‌ర్ కూల్ దూరం! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Dhoni : ధోని ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. స‌న్ రైజర్స్‌తో మ్యాచ్‌కి మిస్ట‌ర్ కూల్ దూరం!

Dhoni : మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి చాలా నెల‌లు అవుతున్నా కూడా అత‌ని క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్రస్తుతం ధోని ఐపీఎల్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ధోని గ్రౌండ్‌లో క‌నిపిస్తే అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంది. వైజాగ్‌లో ధోని ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు. 42 ఏళ్ల ధోని ఇప్ప‌టికీ ఓ రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Dhoni : ధోని ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. స‌న్ రైజర్స్‌తో మ్యాచ్‌కి మిస్ట‌ర్ కూల్ దూరం!

Dhoni : మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి చాలా నెల‌లు అవుతున్నా కూడా అత‌ని క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్రస్తుతం ధోని ఐపీఎల్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ధోని గ్రౌండ్‌లో క‌నిపిస్తే అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంది. వైజాగ్‌లో ధోని ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు. 42 ఏళ్ల ధోని ఇప్ప‌టికీ ఓ రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బౌండరీలు, మూడు భారీ సిక్సర్లు బాది 16 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సాధించాడు. అయితే ఆ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు ఓడిపోవ‌డం అభిమానుల‌ని కాస్త బాధించింది.

Dhoni ధోని మ్యాచ్ ఆడ‌డా..!

ఇప్ప‌టికీ తాను అత్యుత్త‌మ ఫినిషర్ అని నిరూపించుకుంటున్నాడు ధోని. అయితే ధోని ఏ ప్రాంతంకి వెళ్లిన అక్క‌డ ఆయ‌న‌కి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తుంది. చెన్నై టీం శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్ ఆడ‌నున్నాడు. ఈ మ్యాచ్ ఆడితే హైద‌రాబాదీస్ ధోని ఆట‌ని చూసి మురిసిపోవాల‌ని అనుకున్నారు. ఎందుకంటే ధోని ఐపీఎల్‌లో కూడా ఆడ‌డం ఇదే చివ‌రిసారి అవుతుంది. ఇందుకోస‌మే ఆ మ్యాచ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ టిక్కెట్స్ కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. సన్‌రైజర్స్‌ మ్యాచ్‌కు ధోనీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో ధోనీ కాలికి పట్టి ఉన్న ఫొటోలు వైరల్‌గా మారడం మ‌నం చూశాం. గత సీజన్‌లో ధోని మోకాలి గాయంతోనే బరిలోకి దిగి ఆ త‌ర్వాత శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ గాయం ధోనికి తిర‌గ‌బెట్టిన‌ట్టు తెలుస్తుంది. అందుకే ఒక రెండు మూడు మ్యాచ్‌ల‌కి ధోనికి విశ్రాంతి ఇవ్వాల‌ని యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. ఇప్పుడు విశ్రాంతి ఇవ్వ‌క‌పోతే లీగ్ మ‌ధ్య‌లో అర్ధాంత‌రంగా దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్నారు. అయితే దీనిపై సీఎస్‌కే మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కాని ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే రెండింట్లో విజయం సాధించి మంచి ఊపులో ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది