IPL 2025 Schedule : క్రికెట్ అభిమానులకి పండగే పండగ.. మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!
ప్రధానాంశాలు:
IPL 2025 Schedule : క్రికెట్ అభిమానులకి పండగే పండగ.. మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి మజా అందిస్తూ ఉంటారు. అయితే ఈ సారి ఐపీఎల్ చాలా రంజుగా ఉంటుందని అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. కేవలం రెండు రోజుల తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలం ప్రారంభం కాకముందే ఐపీఎల్ తదుపరి సీజన్ తేదీని వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
IPL 2025 Schedule : డేట్స్ వచ్చేశాయి..
సదరు కథనాల ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 25తో ముగియనుంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15న ప్రారంభమై మే 31తో ముగియనుంది. ఐపీఎల్ 2027 ఎడిషన్ మార్చి 14న మొదలై మే 30తో ముగియనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ అధికారిక సమాచారం అందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2025 సీజన్‌లో మునుపటి మూడు సీజన్‌ల మాదిరిగానే 74 మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్ ప్లస్ నాకౌట్ దశలో 10 జట్లు పోటీపడతాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌లు, ఫైనల్‌తో కలిపి మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే 2023-27 సైకిల్ కోసం 2022లో ఐపీఎల్ విక్రయించిన మీడియా హక్కులలో 84 మ్యాచ్‌లు ఆడనున్నట్లు నివేదిక పేర్కొంది. కొత్త సీజన్ కోసం టెండర్ డాక్యుమెంట్‌లో IPL ప్రతి సీజన్‌లో వేర్వేరు సంఖ్యలో మ్యాచ్‌లను ప్రకటించింది. 2023, 2024లో 74 మ్యాచ్‌లు, 2025, 2026లో 84 మ్యాచ్‌లు ఉంటాయని చెప్పింది. ఈ ఒప్పందం చివరి సంవత్సరంలో అంటే 2027లో 94 మ్యాచ్‌లు ఆడినట్లు ప్రస్తావన ఉంది.ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించాల్సి ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ఇది జరిగిన 5 రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ చివరి సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కాగా ఈసారి టోర్నీని 9 రోజుల ముందుగానే ప్రారంభిస్తున్నారు.