Karun Nair : ఈ ప్లేయ‌ర్‌ని ఎవ‌రైన ప‌ట్టించుకోండి.. తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karun Nair : ఈ ప్లేయ‌ర్‌ని ఎవ‌రైన ప‌ట్టించుకోండి.. తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Karun Nair : ఈ ప్లేయ‌ర్‌ని ఎవ‌రైన ప‌ట్టించుకోండి.. తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా..!

Karun Nair : ఐపీఎల్‌ తో ఎంతో మంది టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. పాత ఆట‌గాళ్లు కూడా అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తున్నారు. వారిలో ముందుగా గుర్తొచ్చేది క‌రుణ్ నాయర్. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవ‌ల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ లోనూ కరుణ్ నాయర్ విరుచుకుపడ్డాడు. 8 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం.

Karun Nair ఈ ప్లేయ‌ర్‌ని ఎవ‌రైన ప‌ట్టించుకోండి తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా

Karun Nair : ఈ ప్లేయ‌ర్‌ని ఎవ‌రైన ప‌ట్టించుకోండి.. తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా..!

Karun Nair ఛాన్స్ ద‌క్కేనా ?

వరుస పెట్టి సెంచరీలు చేసినా టీమిండియా సెలెక్షన్ కమిటీ పట్టించుకోలేదు. గతేడాది జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 55 లక్షలకు కరుణ్ నాయర్‌ను సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ద‌క్కించుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని కరుణ్ నాయర్ రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం.

ఎవ‌రు కూడా రాణించ‌ని స‌మ‌యంలో క‌రుణ్ నాయ‌ర్ అద్భుత‌మైన ఫామ్‌లోకి వ‌చ్చి అద‌ర‌గొట్టాడు. బుమ్రాని కూడా వ‌ద‌ల‌కుండా చీల్చి చెండాడాడు. మ‌రి ఇంత మంచి ఫామ్‌లో ఉన్న క‌రుణ్ నాయ‌ర్ కి టీమిండియాలో చోటు కల్పిస్తే బాగుంటుంది. ఐపీఎల్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. టెస్టుల్లో కరుణ్ నాయర్‌కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయలు ఎప్పటి నుంచో వ్యక్తం అవుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది