Kaviya Maran : ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య పాప ఆస్తి ఎన్ని కోట్లు తెలిస్తే నోట మాట కూడ రాదు..!
ప్రధానాంశాలు:
Kaviya Maran : ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య పాప ఆస్తి ఎన్ని కోట్లు తెలిస్తే నోట మాట కూడ రాదు..!
Kaviya Maran : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తుంది. ఈ సీజన్‌లో అందరి దృష్టి ఎస్ఆర్‌హెచ్ పైనే ఉంది. గత సీజన్స్ కి భిన్నంగా ఆ జట్టు ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఆ జట్టు ఉంది. అయితే సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్ కాగా, ఇప్పుడు ఆమె తన టీం ను వెనుక ఉండి నడిపిస్తుంది. గ్రౌండ్‌లో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వికెట్ తీస్తే ఆమె చేసే సందడి.. ప్రత్యర్ధి బ్యాటర్లు సిక్సర్లు కొడితే.. ఆమె ఇచ్చే హావభావాలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే కావ్య మారన్ గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు.
Kaviya Maran : కావ్య రూటే సపరేటు..
కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండరు. ఆమె గురించి తెలుసుకునే అవకాశం కూడా పెద్దగా లేదు. అయితే కావ్య ఆస్తుల లెక్కలు కొన్ని బయటకు రాగా, అవి తెలుసుకొని అందరు ఆశ్చర్యపోతున్నారు. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కాగా, ఈ 31 ఏళ్ల చిన్నది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. యూకే నుంచి ఎంబీఏలో పట్టా సాధించింది. ఒక్కతే కూతురు కాగా, ఆమె రూ.33 వేల కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.417 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.
కావ్య తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్ సీఈవో గా పనిచేస్తున్నారు..ఇక కావ్య కార్ల కలెక్షన్లకు ప్రత్యేకత ఉంటుంది. ఆమెకి కార్లు అంటే మోజు ఎక్కువ. కావ్య వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ధర రూ. 12.2 కోట్లు. ఇక బెంట్లీ బెంటెగా LWB – ధర: రూ. 6 కోట్లు, బీఎండబ్ల్యూ i7- ధర రూ. 2.13 కోట్లు , ఫెరారీ రోమా – ధర రూ. 3.76 కోట్లు ఇలా పలు రకాల కార్లని కలెక్ట్ చేసింది. ఇక కావ్య ఆక్షన్‌లోను అదరగొడుతుంది. ఈమె డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు కూడా.