Kavya Maran : కావ్య మార‌న్ ఏడ్చింది ఓడినందుకు కాదా, ఇదంతా కార్పొరేట్ స్ట్రాట‌జీనా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kavya Maran : కావ్య మార‌న్ ఏడ్చింది ఓడినందుకు కాదా, ఇదంతా కార్పొరేట్ స్ట్రాట‌జీనా..?

Kavya Maran : సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు కావ్య మార‌న్.. సన్‌రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపించినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించే కావ్య.. ఓడినప్పుడు మాత్రం తెగ బాధపడుతుంటారు. ఆమె అలా ఉండటాన్ని చూసి అయ్యో పాపం కావ్య పాప అనుకునే ఫ్యాన్స్ ఎందరో. 2018లో కావ్య మారన్ సన్‌రైజర్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్ప‌టి నుండి త‌న జ‌ట్టుని ద‌గ్గ‌ర ఉండి న‌డిపిస్తుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 May 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Kavya Maran : కావ్య మార‌న్ ఏడ్చింది ఓడినందుకు కాదా, ఇదంతా కార్పొరేట్ స్ట్రాట‌జీనా..?

Kavya Maran : సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు కావ్య మార‌న్.. సన్‌రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపించినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించే కావ్య.. ఓడినప్పుడు మాత్రం తెగ బాధపడుతుంటారు. ఆమె అలా ఉండటాన్ని చూసి అయ్యో పాపం కావ్య పాప అనుకునే ఫ్యాన్స్ ఎందరో. 2018లో కావ్య మారన్ సన్‌రైజర్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్ప‌టి నుండి త‌న జ‌ట్టుని ద‌గ్గ‌ర ఉండి న‌డిపిస్తుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు ఫైనల్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది..కాక‌పోతే కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఫినాలే మ్యాచ్‌లో ఓడింది ఫైనల్స్ లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది.

Kavya Maran కావ్య టూ టాలెంట‌డ్..

ఇక తన టీం ఓటమితో కావ్య మారన్ కన్నీటిపర్యంతమైన తీరు చూసి క్రికెట్ అభిమానులందరూ చలించిపోయారు. చివరకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కూడా కావ్య మారన్ కన్నీరు కదిలించింది. ఎస్ఆర్‌హెచ్ ఓటమి తరువాత బిగ్ బీ నెట్టింట ఓ పోస్ట్ చేశారు. ‘‘ఐపీఎల్ అయిపోయింది. కేకేఆర్ తిరుగులేని విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు అసలు అవకాశమే లేకుండా పోయింది. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి అనేక రకాలుగా విచారం కలిగిస్తోంది. గత మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌‌హెచ్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి కంటే కావ్య మారన్ కన్నీరు పెట్టడం ఎంతగానో కదిలించింది. తన టీం ఓటమి తరువాత ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. చివరకు కెమెరా కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. అయితే, రేపటి రోజుకు మళ్లీ నూతనోత్సాహంతో మొదలుపెట్టాలి’’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

Kavya Maran కావ్య మార‌న్ ఏడ్చింది ఓడినందుకు కాదా ఇదంతా కార్పొరేట్ స్ట్రాట‌జీనా

Kavya Maran : కావ్య మార‌న్ ఏడ్చింది ఓడినందుకు కాదా, ఇదంతా కార్పొరేట్ స్ట్రాట‌జీనా..?

హైదరాబాద్ ఓటమి తర్వాత కావ్య మారన్ జట్టును ప్రోత్సహించినా ఆమె కళ్లలో మాత్రం నీళ్లు తిరిగాయి. ఇదంతా కార్పొరేట్ స్ట్రాటజీలో ఒక భాగమని ప్రముఖ సైకాలజిస్టులు అంటున్నారు. నిజానికి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ప్రైజ్ మనీ రూ.40 కోట్లు వస్తుంది. ఆ రూ.40 కోట్లు పోతుందని కావ్య పాప ఏడుస్తుందా? అని అందరూ సెటైర్లు వేస్తున్నారు. ఒక్క కమిన్స్ కోసమే రూ.20 కోట్లు పైనే ఖర్చుపెట్టిన జట్టు.. రూ.40 కోట్ల ప్రైజ్ మనీ పోతుందని ఎవరన్నా ఏడుస్తారా? అంతా డ్రామా కాకపోతే అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఓడినా, ఆఖరి స్థానంలో ఉన్న ప్రతీ ఫ్రాంచైజీకి ఏడాదికి రూ.400 కోట్లు పైనే వస్తుంది. కాకపోతే ఫ్రాంచైజీకి బ్రాండ్ వాల్యూ రావాలి. అలా వస్తే జెర్సీల మీద, ఇంకా రకరకాల మార్గాల్లో, అలాగే తమ సంస్థలకు ఫ్రీ పబ్లిసిటీల మీద, ఇలా తమ జట్టు మీద ప్రైవేటుగా వందల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అంద‌కని ఇలా చేస్తుంటారంటూ కొందరు చెప్పుకొస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది