Kavya Maran : ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కోసం కావ్య పాప డేరింగ్ నిర్ణయం.. కోట్లు నష్టపోయిన పర్వాలేదు..!
Kavya Maran : ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో దుమ్ము రేపుతుంది. ఓనర్ కావ్య మారన్ వారికి మంచి సపోర్ట్ అందిస్తుండడంతో ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం (మే17) జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది. దీంతో రెండు జట్లకి చెరొక పాయింట్ లభించింది. 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. మరోవైపు గుజరాత్ 12 పాయింట్లతో ఈ సీజన్ ను ముగించింది. కాగా ఎస్ఆర్‌హెచ్ గుజరాత్ మ్యాచ్ రద్దయ్యాక ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫ్యాన్స్ చాలా నిరుత్సాహం చెందారు.
Kavya Maran మంచి మనస్సు..
వేలాది రూపాయలు పోగేసి కొన్న మ్యాచ్ టిక్కెట్లు వృథా కావడంతో ఎస్ఆర్ హెచ్ యజమాని కావ్య మారన్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వచ్చిన ప్రేక్షకుల డబ్బును వాపస్ ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకులకు డబ్బును రీఫండ్ చేయబోతున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. Paytm లేదా Paytm ఇన్‌సైడర్ ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేసిన వారికి వారి డబ్బు తిరిగి జమ కానుందని తెలియజేసింది. దీని కోసం ఫ్రాంఛైజీ ఇమెయిల్ ద్వారా టికెట్లు కొన్న వారిని సంప్రదిస్తుంది. అయితే వాస్తవానికి, చాలా మంది అభిమానులు బ్లాక్ లో టికెట్లు కొన్నారు.
మ్యాచ్ కోసం చాలా మంది అభిమానులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. దీంతో బ్లాక్ లో టికెట్లు కొన్నవారంతా తెగ బాధపడిపోతున్నారు. ఈ నిర్ణయం వల్ల కావ్య మారన్ ఫ్రాంచైజీకి కోట్లలో నష్టం వాటిల్లనుంది. అయినప్పటికీ కావ్య మారన్ మంచి మనసు చేసుకొని టిక్కెట్ అమౌంట్ రిటర్న్ చేస్తుంది.