KL Rahul : పెళ్లి పీటలెక్కనున్న టీమిండియా ఓపెనర్.. అందుకే ఫస్ట్ వన్డేకి దూరం కానున్నాడా..!
KL Rahul : ఈ మధ్య కాలంలో టీమిండియా జట్టుకి సంబంధించి చాలా క్రికెటర్స్ పెళ్లి పీటలెక్కారు. కొందరు పెళ్లి వలన పలు మ్యాచ్‌లకు దూరం అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. ఇక త్వరలో కేఎల్ రాహుల్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని, ఈ కారణంగానే అతడు విండీస్‌తో జరగనున్న తొలి వన్డేకి దూరం అవుతున్నాడని కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే మంగళూరులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు రాహుల్. అతడి తండ్రి పేరు డాక్టర్ కేఎన్ లోకేశ్. ఆయన ప్రొఫెసర్. ఇక రాహుల్ తల్లి రాజేశ్వరి. ఆమె కూడా ప్రొఫెసరే. కేఎల్ రాహుల్‌కు చెల్లెలు భావన ఉంది.
రాహుల్ చెల్లికి పెళ్లి సెటిలైందని, ఆ పనులతోనే రాహుల్ బిజీగా ఉన్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో వెల్లడించింది. మరి కొద్ది రోజులలో రాహుల్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయట. అతడి సోదరి భావన వివాహం త్వరలోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. చెల్లి పెళ్లి పనుల్లో నిమగ్నమైన రాహుల్ అందుకే మొదటి వన్డేకు దూరమైనట్లు సమాచారం ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డేతో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ పేర్కొంది.
KL Rahul : చెల్లి పెళ్లి కోసమే..
అయితే, తాజాగా టీమిండియా శిబిరంలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ తదితరులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6న సిరీస్ ఆరంభమవుతుందా లేదా అన్న సందిగ్దం నెలకొంది. ముఖ్యంగా ధావన్, రుతురాజ్ వైరస్ బారిన పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఓపెనింగ్ చేయడానికి మరో ఆప్షన్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.