KL Rahul : టీంలో కేఎల్ రాహుల్ పరిస్థితి పై క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
KL Rahul : టీంలో కేఎల్ రాహుల్ పరిస్థితి దారుణం.. క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
KL Rahul : ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాపై ఇండియాని గెలిపించిన విషయం తెలిసిందే. వికెట్ కీపింగ్ బాధ్యతలు అద్భుతంగా మోస్తూనే మరోవైపు బ్యాటింగ్‌లోను రాణిస్తున్నాడు రాహుల్. భారీ సిక్స్ తో రాహుల్ మ్యాచ్ ను ముగించడంతో అందరూ అతడిని హీరోలా చూస్తున్నారు. వాస్తవానికి రాహుల్ టీమ్ ఇండియా కెప్టెన్ కావాల్సిన వాడు. కానీ, అతడిని టైమ్ వెంటాడింది

KL Rahul : టీంలో కేఎల్ రాహుల్ పరిస్థితి దారుణం.. క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాహుల్ గురించి టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూత తాజాగా స్పందించారు. టీమ్ ఇండియాలో సైలెంట్ కిల్లర్ కేఎల్ రాహుల్ అని.. జట్టుకు ఏ అవసరం ఉన్నా.. అతడు సిద్ధంగా ఉంటాడని కొనియాడారు. టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్ ను స్పేర్ టైర్ ను మించి వాడారని సిద్ధూ తెలియజేశారు. కీపింగ్.. ఆరో స్థానంలో బ్యాటింగ్.. ఒక్కోసారి ఓపెనింగ్.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ వంటి సిరీస్ లలో వన్ డౌన్.. మళ్లీ ఓపెనింగ్.. ఇలా అనేక బాధ్యతలను రాహుల్ నెత్తిన మోపారాని అయినా అతడు అన్నిటినీ సమర్థంగా నిర్వర్తించాడమని సిద్ధూ చెప్పుకొచ్చారు.
దేశం కోసం నిస్వార్థంగా త్యాగం చేసేవారు గొప్పవారని.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఇలానే చేశారని.. అందుకే ఆయనకు అంత పేరొచ్చిందని సిద్ధూ భావోద్వేగంగా రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ కెరీర్‌లో ఏడు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశాడు