Kohli : రికార్డులు ముఖ్యం కాదు, ఇండియా గెలుపు ముఖ్యం.. కోహ్లీ నిస్వార్థానికి సెల్యూట్ చేస్తున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kohli : రికార్డులు ముఖ్యం కాదు, ఇండియా గెలుపు ముఖ్యం.. కోహ్లీ నిస్వార్థానికి సెల్యూట్ చేస్తున్న నెటిజ‌న్స్

Kohli : ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న బ్యాట్ ప‌ట్టాడంటే బంతి బౌండ‌రీ దాటాల్సిందే. రికార్డులు చెరిగిపోవ‌ల్సిందే. స‌చిన్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన వ్య‌క్తిగా రికార్డులు సాధించాడు కోహ్లీ. కొంత కాలంగా ఫామ్ లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తుంది. కోహ్లీ బ్యాట్ నుండి ప‌రుగుల వ‌ర‌ద పారుతుంది. సౌతాఫ్రికా, ఇండియా మధ్య గౌహతిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఫుల్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :3 October 2022,9:00 pm

Kohli : ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న బ్యాట్ ప‌ట్టాడంటే బంతి బౌండ‌రీ దాటాల్సిందే. రికార్డులు చెరిగిపోవ‌ల్సిందే. స‌చిన్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన వ్య‌క్తిగా రికార్డులు సాధించాడు కోహ్లీ. కొంత కాలంగా ఫామ్ లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తుంది. కోహ్లీ బ్యాట్ నుండి ప‌రుగుల వ‌ర‌ద పారుతుంది. సౌతాఫ్రికా, ఇండియా మధ్య గౌహతిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఫుల్ మీల్స్‌ మజాని అందించింది. . టీమిండియా తరుపున బ్యాటింగ్‌కి వచ్చిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ కూడా తమ మార్క్ చూపించడంతో అభిమానులు ఫుల్లు ఖుష్ అవుతున్నారు…

ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్ర‌వ‌ర్త‌న అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 19వ ఓవర్ మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్ రనౌట్ కాగా, ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, 19వ ఓవర్ ముగిసే సమయానికి 28 బంతుల్లో 49 పరుగుల వద్ద నిలిచాడు. ఇక చివ‌రి ఓవ‌ర్‌లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి బంతికి పరుగులేమీ చేయలేకపోయిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత 4,0, 6,6 బాదాడు. కగిసో రబాడా వేసిన ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్, నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి… ‘సింగిల్ తీసి స్ట్రైయిక్ ఇవ్వనా, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటావా?’ అని అడిగాడు…

kohli praise by netigens

kohli praise by netigens

Kohli : కోహ్లీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు..

దానికి విరాట్ కోహ్లీ… ‘వద్దు, భారీ షాట్‌కి వెళ్లు’ అంటూ సైగలతో సూచించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్న కోహ్లీకి ఈ 50 ఎక్కువ అనిపించ‌లేదు. అంతేకాదు ఇప్పటికే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. మరో పరుగు చేసి ఉంటే ఆ లెక్కను మరింత పెంచుకునేవాడు. కాని టీమ్ కోసం ప్రాధాన్యం ఇచ్చి తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు విరాట్ కోహ్లీ…. డీకేను బ్యాటింగ్ కొనసాగించమని విరాట్ చెప్పడంతో ప్రశంసల జల్లు కురుస్తోంది. నెటిజన్లు కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారు. వ్యక్తిగత రికార్డు కోసం స్వార్థంగా ఆలోచించకుండా కోహ్లీ నిస్వార్థంగా వ్యవహరించడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది