Vignesh Puthur : కొత్త కుర్రాడి టాలెంట్‌కి ఫిదా అయిన ధోని.. ప్రత్యేకంగా అభినందనలు..!
ప్రధానాంశాలు:
Vignesh Puthur : కొత్త కుర్రాడి టాలెంట్‌కి ఫిదా అయిన ధోని.. ప్రత్యేకంగా అభినందనలు..!
Vignesh Puthur : చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు . రోహిత్ శర్మ స్థానంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్‌కు ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

Vignesh Puthur : కొత్త కుర్రాడి టాలెంట్‌కి ఫిదా అయిన ధోని.. ప్రత్యేకంగా అభినందనలు..!
Vignesh Puthur ధోని అభినందనలు..IPL
అంతేకాదు తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. విఘ్నేశ్ తన తొలి ఐపీఎల్ వికెట్‌ను CSK కెప్టెన్ రీతురాజ్ గైక్వాడ్ రూపంలో తీసుకున్నాడు. ఆ తర్వాత అతను శివం దుబే (9)వికెట్ పడగొట్టడు. ఇలా అతను తన స్పెల్‌లో 32 పరుగులకు మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ విఘ్నేశ్ పుత్తూర్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
కెప్టెన్ సూర్యకుమార్ 3 ఓవర్ల తర్వాత తన ఓవర్‌ను ఆపివేశాడు. ఇది పెద్ద తప్పు అని నిరూపణ అయింది. ఎందుకంటే అతను 3 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ముంబై జట్టుకు గట్టి పునాదిని వేశాడు విఘ్నేష్. ఇంకొక ఓవర్ కూడా ఇచ్చి ఉంటే మ్యాచ్ స్వరూపం మారి ఉండేదని అంటున్నారు. ఆటో డ్రైవర్ కొడుకు అయిన విఘ్నేష్ తన టాలెంట్‌తో ధోని మెప్పు కూడా పొందాడు. మ్యాచ్ పూర్తయ్యాక విఘ్నేష్‌ని ప్రత్యేకంగా అభినందించాడు ధోని.