MS Dhoni : బీసీసీఐ సంచలన నిర్ణయం.. మళ్లీ టీమిండియాలోకి ధోనీ?
MS Dhoni : మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్పులను అందించిన ఘనత ఆయనదే. రెండు వరల్డ్ కప్పులను భారత్ కు అందించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పి కేవలం ఐపీఎల్ లో మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు ధోనీ. అలాగే ఈ మధ్య కొన్ని బిజినెస్‌లు స్టార్ట్ చేసిన ధోనీ.. తన వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నాడు. ఈనేపథ్యంలో ధోనీ గురించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది భారత జట్టులో మళ్లీ ధోనీ ఆడబోతున్నాడని.
బీసీసీఐనే ధోనీని మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలని అనుకుంటోందట. దానికి కారణం.. ప్రస్తుతం భారత జట్టు పేలవ ప్రదర్శన అని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022 లో భారత్ సెమీస్ నుంచే వెనుదిరిగిన విషయం తెలిసిందే. కేవలం పాకిస్థాన్ మీద మాత్రమే గెలిచిన టీమిండియా ఆ తర్వాత అంతగా ఆడింది లేదు. సెమీస్ వరకు చేరుకున్నా.. చివరకు ఇంగ్లండ్ చేతుల్లో దారుణంగా ఓటమి పాలయింది భారత్. MS Dhoni : భారత జట్టులో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైన బీసీసీఐ 2011 లో ఐసీసీ ట్రోఫీని గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఒక్క ట్రోఫీని కూడా టీమిండియా గెలుచుకోలేకపోయింది. 2011 లో ధోనీ పుణ్యమాని ఐసీసీ ట్రోఫీని ఇండియా గెలుచుకోగలిగింది.
ఈ 11 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ట్రోఫీని కూడా టీమిండియా గెలుచుకోలేకపోవడంతో భారత జట్టులో సమూల మార్పులు చేయడమే బెటర్ అని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ధోనీని జట్టులోకి తీసుకొని మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడించాలని భావిస్తోంది. 2023 తర్వాత ధోనీని ఐపీఎల్ నుంచి తప్పించి టీమిండియాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్ల ఫిట్ నెస్ ను కూడా చూసుకోవడం కోసం ధోనీనే నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. పూర్తిస్థాయిలో టీమిండియా బాధ్యతలను ధోనీకే అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. దానికి సంబంధించి ధోనీతో కూడా బీసీసీఐ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ధోనీ సారథ్యంలో అయినా టీమిండియా ఆటతీరు మారుతుందేమో?