MS Dhoni : ఇత‌ను గ్యాంగ్ రౌడీ కాదు.. ఎంఎస్ ధోని.. ఇలా ఎందుకు మారాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MS Dhoni : ఇత‌ను గ్యాంగ్ రౌడీ కాదు.. ఎంఎస్ ధోని.. ఇలా ఎందుకు మారాడో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :27 February 2022,4:30 pm

MS Dhoni : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్‌గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయిన ధోని ఎన్నో సిరీస్‌లు అందించాడు. ఆయ‌న‌ కెప్టెన్సీలో మన దేశానికి వన్డేతో పాటు టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. రిటైర్మెంట్ త‌ర్వాత ధోని ప‌లు ప్రయోగాలు చేస్తున్నాడు. న‌టుడిగాను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. జీవితంపై తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని .. ది అన్‌టోల్డ్ స్టోరీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ప్ర‌స్తుతం ధోని ప్రధాన యానిమేషన్ పాత్రలో ‘అథర్వ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అందులో అథర్వగా ఎం.ఎస్.ధోని లుక్ స‌రికొత్త‌గా ఉంటుంది. పూర్తి గ్రాఫిక్స్‌తో మైథాలాజికల్ సైంటిపిక్ వెబ్ సిరీస్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌లో ఎం.ఎస్.ధోని అథర్వ.. ది ఆరిజన్’ యానిమేటేడ్ రూపంలో అభిమానులను అలరించనున్నారు. దీన్ని ధోని ఎంర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ నవలను రమేష్ తమిళమణి రచించారు. ఈయన ఐపీఎల్‌లో ‘చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈయన ఆధర్వంలోనే ఈ టీమ్ ఎక్కువ సిరీస్‌లను కైవసం చేసుకుంది

Ms dhoni look mesmarizes the audience

Ms dhoni look mesmarizes the audience

MS Dhoni : అస్స‌లు గుర్తు ప‌ట్టలేకుండా ఉందిగా…!

ఇప్పుడు ఐపీఎల్ ప్రమోష‌న్‌లో భాగంగా ధోని స‌రికొత్త లుక్‌లో మెరిసారు. చెన్నై బస్‌డ్రైవర్‌ యునిఫామ్‌ వేసుకొని.. చేతిలో మైక్‌ పట్టుకొని ఆటకు వేళాయే అన్నట్లుగా లుక్‌ ఉంది. ఇక చివర్లో కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకొని బస్‌ స్టార్ట్‌ చేస్తూ ధోని ఇచ్చిన లుక్‌ హైలెట్‌గా నిలిచింది. సరిగ్గా గమనిస్తే తప్ప ధోనిని గుర్తుపట్టలేం. అంతలా మారిపోయాడు.. ధోనినా లేకుంటే వీధి రౌడీనా అని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ధోని స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–15 సీజన్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 26 న ప్రారంభమవ్వగా ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది. మొత్తం 10 టీమ్‌‌‌‌‌‌‌‌లు 72 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడే విధంగా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ముంబైలోని వాంఖడే (20 మ్యాచ్​లు), బ్రబౌర్న్‌‌‌‌‌‌‌‌ (15), డీవై పాటిల్‌‌‌‌‌‌‌‌ (20) స్టేడియాలతో పాటు పుణెలోని ఎంసీఏ స్టేడియం (15)ను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ సారి ఏ టీం ఎన్నిసార్లు టైటిల్ గెలిచింది. ఏ టీం ఎన్ని సార్లు ఫైనల్ కు చేరిందనేది దృష్టిలో పెట్టుకుని 10 టీంలను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది