Naga Chaitanya : ‘రా చూద్దాం’ అంటున్న నాగచైతన్య..!
Naga Chaitanya : క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఆ మాదిరిగానే ప్రజెంట్ కబడ్డీకి క్రేజ్ ఉంది. భారతదేశంలో కబడ్డీ గేమ్ పట్ల చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. ఈ క్రమంలోనేప్రో కబడ్డీ సీజన్స్‌కు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. ఆ గేమ్స్‌ను ఇంట్రెస్ట్‌తో చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు టైటాన్స్ టీంలో ధైర్యం నింపేందుకుగాను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య అక్కినేని వచ్చాడు. నాగచైతన్య తెలుగు టైటాన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయన నటించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, సోషల్ మీడియాలో ప్రజెంట్ అది బాగా వైరలవుతోంది.
ప్రో కబడ్డీ 8వ సీజన్ ఈ నెల 22న బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌ను సపోర్ట్ చేసేందుకుగాను నాగచైతన్య రంగంలోకి దిగాడు. గత సీజన్స్‌లో తెలుగు టైటాన్స్‌కు రానా దగ్గుబాటి అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు నాగచైతన్య అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక విడుదలైన ప్రోమోలో నాగచైతన్య చాలా యాక్టివ్‌గా ఉన్నాడు.ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ టీంను సపోర్ట్ చేసేందుకుగాను రూపొందించిన ఈ వీడియోలో నాగచైతన్య చాలా యాక్టివ్‌గా కనబడుతున్నాడు. స్పోర్ట్స్‌లో ఉండాల్సిన స్పిరిట్ గురించి చెప్పకనే చెప్పే విధంగా ఉండేందుకుగాను,

Naga chaitanya promoting telugu titans team in pro kabaddi
Naga Chaitanya : కీర్తి వేటకు సిద్ధమైన తెలుగు టైటాన్స్..
వారిని ఉత్సాహ పరిచేందుకుగాను ఈ వీడియో రూపొందించినట్లు అర్థమవుతున్నది. ‘ రా చూద్దాం…చేతులో సుత్తెలవుతే.. కాళ్ల స్తంభాలైతే.. బండైనా కొండైనా.. రా రూ చూద్దాం.. శరీరం కాదిది.. ఒక స్టీల్ ఆయుధం.. జెర్సీ మాత్రమే కాదు.. ఒక కవచం ఇది.. గ్రౌండ్ కాదు.. పోరాట స్థలి ఇది.. ఆటైనా.. యుద్దమైనా.. రా చూద్దాం.. సిద్దమవ్వండి.. తెలుగు టైటాన్స్ కీర్తి వేటకు.. పద ముందుకు.. రా చూద్దాం..’ అంటూ వదిలిన ప్రోమో నెట్టింట హల్ చల్ అవుతోంది. నాగచైతన్య ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తను నటించిన వీడియో ప్రోమోను ట్విట్ చేసి తెలుగు టైటాన్స్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రోమోతో పాటు నాగచైతన్య ట్వీట్ కూడా వైరలవుతున్నది.
