Natasa Stankovic : హార్ధిక్ నుండి విడిపోయాక న‌టాషా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా.. అమ్మ‌డి స‌మాధానం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Natasa Stankovic : హార్ధిక్ నుండి విడిపోయాక న‌టాషా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా.. అమ్మ‌డి స‌మాధానం ఏంటి?

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Natasa Stankovic : హార్ధిక్ నుండి విడిపోయాక న‌టాషా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా.. అమ్మ‌డి స‌మాధానం ఏంటి?

Natasa Stankovic : ఇటీవ‌ల బ్రేక‌ప్‌ల గురించి ఎక్కువ‌గా వింటున్నాం. ప్రేమ‌లో ప‌డ‌డం తిరిగి వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రముఖ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో Hardik Pandya ఆమె 2024లో జులైలో విడిపోయారు. కొంతకాలంగా నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి.

Natasa Stankovic హార్ధిక్ నుండి విడిపోయాక న‌టాషా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా అమ్మ‌డి స‌మాధానం ఏంటి

Natasa Stankovic : హార్ధిక్ నుండి విడిపోయాక న‌టాషా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా.. అమ్మ‌డి స‌మాధానం ఏంటి?

Natasa Stankovic మ‌ళ్లీ ప్రేమ‌నా..

ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో పబ్లిక్ గా కనిపించడంతో ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. తాజాగా, మళ్లీ ప్రేమలో పడ్డారా? అన్న ప్రశ్నకు నటాషా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ మళ్లీ ప్రేమలో పడడానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జీవితం ఏం అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు. నమ్మకం, అవగాహనతో నిర్మితమైన అర్థవంతమైన సంబంధాలకు నేను విలువ ఇస్తాను. ప్రేమ నా ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను, అంతకుమించి ప్రేమ గురించి నిర్వచించలేం అని తెలిపారు. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను బాధించిందని నటాషా చెప్పారు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మరింత రాటుదేలుతామని చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది