ODI World Cup 2023 : ప్రపంచ కప్ చరిత్రలోనే బెస్ట్ కెప్టెన్లు వీళ్లు.. ధోనీ ఎన్నో ప్లేస్ లో ఉన్నాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ODI World Cup 2023 : ప్రపంచ కప్ చరిత్రలోనే బెస్ట్ కెప్టెన్లు వీళ్లు.. ధోనీ ఎన్నో ప్లేస్ లో ఉన్నాడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :3 October 2023,5:00 pm

ODI World Cup 2023 : ఇది కదా అసలైన పండుగ అంటే. మనకు దసరా, దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు అనుకుంటాం కానీ.. క్రికెట్ అభిమానులకు మాత్రం క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయితే అదే పెద్ద పండుగ. ఇంకో రెండు రోజుల్లో వన్డే ప్రపంచ కప్ సమరం స్టార్ట్ కాబోతోంది. ఈనేపథ్యంలో అందరూ క్రికెట్ గురించే ఎదురు చూస్తున్నారు. ఈనెల, వచ్చే నెల రెండు నెలల పాటు క్రికెట్ సమరం కంటిన్యూ కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ అభిమానులకు పండుగ అనే చెప్పుకోవచ్చు. అయితే.. వరల్డ్ కప్ అనగానే మనకు గుర్తొచ్చేది కెప్టెన్స్. అవును.. ఏ జట్టు కెప్టెన్ ఎంత బెస్ట్ గా ఉంటేనే ఆ జట్టు ప్రపంచ కప్ లో గెలుస్తుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే బెస్ట్ కెప్టెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఆయన నేతృత్వంలో రెండు సార్లు ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచింది. 2003 ప్రపంచ కప్ లో, 2007 ప్రపంచ కప్ లో రికీ పాంటింగ్ కెప్టెన్ గా ఉన్నప్పుడే ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అందుకే ఆయన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇక రెండో కెప్టెన్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ నిలిచాడు. ఈయన న్యూజిలాండ్ కెప్టెన్. నిజానికి ఈయన సారథ్యంలో న్యూజిలాండ్ ప్రపంచ కప్ ను గెలవకపోయినా ఆయన వల్ల న్యూజిలాండ్ చాలా విజయాలు సాధించింది. 1999 లో న్యూజిలాండ్ సెమీస్ వరకు వెళ్లి పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయింది.

one day world cup 2023 best captains

#image_title

ODI World Cup 2023 : మూడో ప్లేస్ లో క్లయివ్ లాయిడ్, నాలుగో ప్లేస్ లో ధోనీ

వెస్టిండిస్ కెప్టెన్ గా క్లయివ్ లాయిడ్ రెండు సార్లు ప్రపంచ కప్ ను సాధించాడు. 1975, 1979 రెండు సార్లు వెస్టిండీస్ వరల్డ్ కప్ గెలిచింది. ఇక.. 2011 లో టీమిండియాకు వరల్డ్ కప్ ను అందించిన ధోనీ నాలుగో ప్లేస్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. 1983 తర్వాత చాలా ఏళ్లకు భారత్ ప్రపంచ కప్ ను సాధించింది. ఆ తర్వాత ఐదో ప్లేస్ లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నిలిచాడు. 1992 లో పాకిస్థాన్ కు ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ అందించాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది