Virat Kohli : కోహ్లీ కొట్టిన చివరి రెండు సిక్సులపై పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ వ్యాఖ్యలు వైరల్
Virat Kohli : టీ20 వరల్డ్ కప్ ముగిసిపోయింది. అయినా కూడా ఇంకా టీ20 వరల్డ్ కప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి.. టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరేట్ గా భారత్ బరిలోకి దిగినప్పటికీ సెమీస్ నుంచి టీమిండియా వరల్డ్ కప్ లో తప్పుకోవాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2022 లో హైలైట్ అయిన మ్యాచ్ లు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఎంత హైలైట్ అయిందో.. అది ఎంత హైఓల్టేజ్ మ్యాచ్ అనేది దాన్ని చూసిన వాళ్లకు అర్థం అవుతుంది.
ఆ మ్యాచ్ లో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దానికి కారణం.. చివరి క్షణంలో ఓడిపోబోయే మ్యాచ్ లో భారత్ గెలవడం. అసలు 8 బంతుల్లో 28 పరుగులు చేయాలంటే.. ఇక అది కాని పని అని అంతా అనుకున్నారు. ఇక ఈ మ్యాచ్ గెలుపు కష్టం అనుకున్నారు. పాకిస్థాన్ కూడా సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయింది. కానీ.. ఒక్క రెండు సిక్సులు ఆటనే మార్చేశాయి. చివరి రెండు బంతులను విరాట్ కోహ్లీ సిక్సులు బాదడంతో ఆట ఒక్కసారిగా మారిపోయింది. పాకిస్థాన్ ఆశలన్నీ అడియాశలయిపోయాయి. అక్కడ సిక్సులు బాదింది ఎవరో కాదు..
Virat Kohli : చివరి రెండు బంతులు సిక్సులు బాదిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ. చివరి ఓవర్ వేసింది హరీస్ రౌఫ్. ఆ రెండు సిక్సులు కొట్టింది కోహ్లీ కావడంతో పాకిస్థాన్ క్రికెటర్లు సైతం వాహ్వా అంటున్నారు. ఆ సిక్స్ లను కోహ్లీ తప్ప ఇంకెవరూ చేయలేరని రౌఫ్ అన్నాడు. వేరే వాళ్లు కొట్టి ఉంటే నా బౌలింగ్ మీద నాకే అనుమానం వచ్చి ఉండేది. కానీ.. కొట్టింది విరాట్ కోహ్లీ. ఇంకెవరో కొడితే నేను ఖచ్చితంగా బాధపడేవాడిని. అలాంటి బాల్స్ కు సిక్సులు కొట్టే సత్తా ఉన్నది కేవలం విరాట్ కోహ్లీకే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రౌఫ్.