భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్
భారత క్రికెట్ జట్టు జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆగస్టు నుంచి జరగనున్న టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ప్రయాణం కానున్న విషయం విదితమే. ప్రస్తుతం జట్టు ఆటగాళ్లు ముంబైలో క్వారంటైన్‌లో ఉన్నారు. 14 రోజులు గడిచాక వారు అక్కడి నుంచి ఇంగ్లండ్‌కు ప్రయాణం అవుతారు. అయితే భారత జట్టు తమ పర్యటనలో భాగంగా దాదాపుగా సెప్టెంబర్ వరకు ఇంగ్లండ్‌లోనే ఉంటుంది. కానీ శ్రీలంకలో జూలైలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీంతో ఆ టూర్‌కు భారత జట్టులోని యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆ జట్టుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను కోచ్‌గా నియమించారు.
రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అండర్ 19, ఇండియా ఎ జట్టు ఆటగాళ్లకు అతను శిక్షణను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక టూర్‌లో భారత జట్టు కోచ్‌గా ద్రావిడ్ వ్యవహరించనున్నాడు. అయితే ద్రావిడ్ భారత జట్టుకు కోచ్‌గా ఉండడం ఇది రెండో సారి. 2014లో ఇంగ్లండ్ టూర్‌లో ద్రావిడ్ భారత బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.
కాగా ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి భారత టెస్టు జట్టుతో ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక టూర్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లకు ద్రావిడ్ కోచ్‌గా ఉంటాడు. ఇక ద్రావిడ్‌కు 2019లో ఎన్ఏసీ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే ద్రావిడ్ ఎంతో మంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. అందువల్లే ద్రావిడ్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. ఇక శ్రీలంక టూర్‌లో భారత జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉంటాడని తెలుస్తోంది. శ్రీలంక టూర్‌లో భారత్ 3 వన్డేలు, 3 టీ20లను ఆడనుంది. దీంతో యువ ఆటగాళ్లకు ఇదొక చక్కని అవకాశంగా భావిస్తున్నారు. వన్డే సిరీస్ జూలై 13, 16, 19వ తేదీల్లో జరగనుండగా, టీ20 మ్యాచ్‌లు జూలై 22 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇక భారత టెస్టు జట్టు జూన్ 2వ తేదీన ఇంగ్లండ్‌కు ప్రయాణం అవుతుంది. జూన్ 18 నుంచి న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ తలపడుతుంది. తరువాత ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది.