Ravindra Jadeja : జడేజా రిటైర్‌మెంట్‌పై భిన్న కథనాలు.. 2027 వరల్డ్ కప్ కూడా ఆడనున్నాడా..!
ప్రధానాంశాలు:
Ravindra Jadeja : జడేజా రిటైర్‌మెంట్‌పై భిన్న కథనాలు.. 2027 వరల్డ్ కప్ కూడా ఆడనున్నాడా..!
Ravindra Jadeja : టీమిండియాలో కొందరు ఆటగాళ్లకి రిటైర్మెంట్ వయస్సు వచ్చేసింది. రోహిత్, విరాట్, జడేజా, షమీ వంటి వారు రిటైర్మెంట్‌కి దగ్గర కాగా, వారు ఎప్పుడు రిటైర్ అవుతారనే దానిపై చర్చ నడుస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో జడేజా ప్రవర్తించిన తీరు ఇందుకు బలం చేకూర్చుతోంది. ఈ మ్యాచ్‌లో జడేజా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి ఓ వికెట్ తీసాడు. తన స్పెల్ పూర్తయిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు.

Ravindra Jadeja : జడేజా రిటైర్‌మెంట్‌పై భిన్న కథనాలు.. 2027 వరల్డ్ కప్ కూడా ఆడనున్నాడా..!
Ravindra Jadeja ఇదే క్లారిటీ..
జడేజాను కౌగిలించుకున్న కోహ్లీ.. రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అశ్విన్ రిటైర్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ను కూడా ఇలాగే హగ్ చేసుకున్న కోహ్లీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో జడేజా రిటైర్మెంట్ చేస్తాడని అంతా భావించారు.
కాని జడేజాకి ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని, 2027 లో వ్చచే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడతాడని తెలుస్తుంది. దయచేసి ఎవరు కూడా తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేయోద్దని ఆయన సన్నిహితులు అంటున్నారు. రోహిత్ కూడా రిటైర్ అవుతాడని ప్రచారం జరగగా, ఆయన తనకి అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు