Ravindra Jadeja : మొన్న కెప్టెన్సీకి దూరం.. ఇప్పుడు పూర్తిగా ఐపీఎల్‌కి దూరం కానున్న రవీంద్ర జడేజా | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ravindra Jadeja : మొన్న కెప్టెన్సీకి దూరం.. ఇప్పుడు పూర్తిగా ఐపీఎల్‌కి దూరం కానున్న రవీంద్ర జడేజా

Ravindra Jadeja : ఐపీఎల్ 2022 ప్ర‌స్తుతం జోరుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో కొన్ని జ‌ట్ల మ‌ధ్య ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి ఈ సీజ‌న్ ఎన్నో చేదు జ్ఞ‌ప‌కాల‌ని మిగిల్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగిన ఐపీఎల్ 2020 సీజన్ తరహాలోనే ఈ సారి కూడా నిరాశపరిచిందీ నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు. ముంబై ఇండియన్స్ పరిస్థితీ ఇంతే. ఇప్పటివరకు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 May 2022,7:30 pm

Ravindra Jadeja : ఐపీఎల్ 2022 ప్ర‌స్తుతం జోరుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో కొన్ని జ‌ట్ల మ‌ధ్య ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి ఈ సీజ‌న్ ఎన్నో చేదు జ్ఞ‌ప‌కాల‌ని మిగిల్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగిన ఐపీఎల్ 2020 సీజన్ తరహాలోనే ఈ సారి కూడా నిరాశపరిచిందీ నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు. ముంబై ఇండియన్స్ పరిస్థితీ ఇంతే. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది చెన్నై సూప‌ర్ కింగ్స్. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అయితే సీఎస్‌కే దారుణ ప్రదర్శనకు కెప్టెన్సీ మార్పు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు.ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా కేప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. కేప్టెన్సీ మార్పు వ్యవహారమే ఆ జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కేప్టెన్సీ మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీ చేతుల్లోకి వచ్చిన తరువాత కొంత సానుకూల ఫలితాలొచ్చాయి గానీ.. అప్పటికే పరిస్థితులు పూర్తిగా చేజారి పోయాయి. చేతులు పూర్తిగా కాలిన దశలో తన తప్పును గ్రహించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. జట్టు పగ్గాలను మళ్లీ ధోనీకే అప్పగించింది. ఆ తరువాత కూడా పెద్దగా మార్పులేమీ రాలేదు గానీ.. గెలిచిన మ్యాచ్‌ల సంఖ్యను స్వల్పంగా పెంచుకోగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

Ravindra Jadeja out from ipl

Ravindra Jadeja out from ipl

Ravindra Jadeja : ఐపీఎల్ నుండి ఔట్…!

అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. బౌలింగ్‌లో పదును తగ్గింది. బ్యాటింగ్‌లో భారీ షాట్లను ఆడలేక ఒత్తిడికి గురయ్యాడు. కేప్టెన్సీ భారాన్ని అతను మోయలేకపోతున్నాడు. ఇక తాజాగా- ఐపీఎల్ మొత్తానికీ దూరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గాయం వల్ల ఇప్పటికే రెండు మ్యాచ్‌లను అతను ఆడలేదు. డగౌట్‌కే పరిమితం అయ్యాడు. ఇక తాజాగా మిగిలిన మ్యాచ్‌లకు కూడా జడేజా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో డైవ్ చేయగా.. ఛాతీపై గాయాలయ్యాయి. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కూడా రవీంద్ర జడేజా గైర్హాజర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ల నుంచి కూడా తప్పుకుంటాడని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది