World Cup Final 2023 : ఆస్ట్రేలియా టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చిన రోజా …! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

World Cup Final 2023 : ఆస్ట్రేలియా టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చిన రోజా …!

World Cup Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం భారతీయులలో ఉత్కంఠత నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాగే కొందరు భారత్ కి వరల్డ్ కప్ రావాలని పూజలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 November 2023,5:40 pm

ప్రధానాంశాలు:

  •  World Cup Final 2023 : ఆస్ట్రేలియా టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చిన రోజా ...!

  •  ndia vs Australia Final 2023

  •  ప్ర‌పంచ క‌ప్ 2023 ఫైన‌ల్ భారత్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా

World Cup Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం భారతీయులలో ఉత్కంఠత నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాగే కొందరు భారత్ కి వరల్డ్ కప్ రావాలని పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా వరల్డ్ కప్ గురించి కీలక కామెంట్స్ చేశారు.

ఆమె మాట్లాడుతూ .. 2023 ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్ కచ్చితంగా గెలుస్తుంది. రోహిత్ శర్మ సారధ్యంలో మన ఇండియా వరల్డ్ కప్ కొట్టబోతుంది. ఈ వరల్డ్ కప్ లో మన టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీద విజయం సాధించి 20 ఏళ్లుగా ఉన్న రివేంజ్ ని భారత్ తీర్చుకోబోతుంది. ఇందులో సందేహమే లేదు. 165 కోట్ల భారతీయులంతా భారత్ టీం కోసం ప్రార్థనలు చేయమని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . ఎందుకంటే మనం 12 ఏళ్లుగా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నాం.

1983 , 2011 తర్వాత మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలవబోతున్నాం. భారత్ టీం కి ఆల్ ద బెస్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అహ్మదాబాద్ కి వెళ్లారు. భారత అభిమానులు భారీగా రావడంతో నరేంద్ర మోడీ స్టేడియం బ్లూ సీ గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో పటిష్టంగా ఉన్న భారత్-ఆస్ట్రేలియా పోటీపడుతుండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది