MS Dhoni : ధోని లాంటి టాలెంట్ అత‌ని సొంతం.. పాపం కుళ్లు రాజ‌కీయాల‌కి బ‌ల‌వుతున్నాడు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

MS Dhoni : ధోని లాంటి టాలెంట్ అత‌ని సొంతం.. పాపం కుళ్లు రాజ‌కీయాల‌కి బ‌ల‌వుతున్నాడు..!

MS Dhoni : ఇటీవ‌లి టీమిండియా జ‌ట్టు సెల‌క్ష‌న్ చాలా వివాదాస్ప‌దంగా మారుతుంది. మంచి టాలెంట్ ఉన్న ఆట‌గాళ్ల‌ని ప‌క్క‌నపెట్టి ఫామ్‌లో లేని వాళ్లతో ఆడించి విమ‌ర్శ‌లపాల‌వుతుంది బీసీసీఐ. సంజూ సామ్సన్.. మంచి టెక్నిక్ తో పాటు దూకుడుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అనే విష‌యం తెలిసిందే . టీంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా చాట‌గ‌ల‌ ప్లేయర్. ఎంతో ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ కు అవకాశాలు అయితే ఇవ్వ‌డం లేదు. జట్టు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :6 December 2022,7:00 pm

MS Dhoni : ఇటీవ‌లి టీమిండియా జ‌ట్టు సెల‌క్ష‌న్ చాలా వివాదాస్ప‌దంగా మారుతుంది. మంచి టాలెంట్ ఉన్న ఆట‌గాళ్ల‌ని ప‌క్క‌నపెట్టి ఫామ్‌లో లేని వాళ్లతో ఆడించి విమ‌ర్శ‌లపాల‌వుతుంది బీసీసీఐ. సంజూ సామ్సన్.. మంచి టెక్నిక్ తో పాటు దూకుడుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అనే విష‌యం తెలిసిందే . టీంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా చాట‌గ‌ల‌ ప్లేయర్. ఎంతో ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ కు అవకాశాలు అయితే ఇవ్వ‌డం లేదు. జట్టు ఆడే ప్రధాన సిరీస్ లకు ఇతడు దూరంగానే ఉంటూ సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సమయాల్లోనే టీమిండియాకు అప్పుడ‌ప్పుడు ఎంపికవుతున్నాడు. అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో రెగ్యులర్ గా చోటు దక్కుతుందా అంటే లేదనే చెప్పోచ్చు.

ధోని వారసుడిలా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ జ‌ట్టుకి భారం అయిన‌ప్ప‌టికీ, అత‌డికే ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నారు. పంత్ కంటే కూడా ముందే సామ్సన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కూడా పంత్ ఆడినన్ని మ్యాచ్ లు ఆడలేకపోయాడు. ధోని వారసుడనే ట్యాగ్ సంపాదించుకున్న అత‌నికి ధోనిలో ఉన్న ఒక్క క్వాలిటీ కూడా లేదు. అదే సమయంలో సంజూ సామ్సన్ కి మాత్రం ధోని లక్షణాలు చాలానే ఉన్నాయి. మ్యాచ్ ను ఫినిష్ చేయడంతో పాటు వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శన చేయడంలోసంజూ శామ్స‌న్ ధోనికి త‌క్కువేమొ కాదు. ధోని మాదిరిగానే ఎప్పుడు చాలా కూల్‌గా ఉంటాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నికి అవ‌కాశాలు త‌లుపు త‌ట్ట‌డం లేదు.

sanju samson has talent like MS Dhoni

sanju samson has talent like MS Dhoni

MS Dhoni : అన్యాయం జ‌రిగింది..!

న్యూజిలాండ్ తో టి20, వన్డే సిరీస్ లకు ఎంపికయిన ఏం ప్రయోజనం. టీ20 సిరీస్ లో సంజూ శాంసన్ కు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ లో అతడు ఆడతాడని అంతా అనుకున్నారు కాని అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు.బంగ్లాదేశ్ సిరీస్‌లోను అంతే. పంత్ అనూహ్యంగా త‌ప్పుకోవ‌డంతో అత‌ని స్థానంలో శాంస‌న్‌కి ఛాన్స్ ఇస్తార‌ని అనుకున్నారు. కాని రాహుల్‌ని ఎంపిక చేశారు. కీలక సమయంలో రాహుల్ క్యాచ్ డ్రాప్ చేసి భార‌త్‌కి అప‌జ‌యాన్ని అందించ‌డం మ‌నం చూశాం. పంత్‌కి ఇచ్చినన్ని అవకాశాల్లో కనీసం పావు వంతైనా సామ్సన్ కు ఇచ్చి ఉంటే టీమిండియాకు మంచి జరిగి ఉండేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది