Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అండర్సన్ – టెండూల్కర్ సిరీస్లో 300కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.. ముఖ్యంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో.. టీమిండియా పీకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు గిల్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి 269 ప‌రుగులు చేశాడు.

Shubman Gill టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా వీడియో వైర‌ల్‌

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ పరుగులతో గిల్ ఖాతాలో రికార్డుల పంట పండింది. గతంలో 2019లో విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 254 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు భారత కెప్టెన్ సాధించిన అత్యధిక స్కోరుగా ఉండేది. ఈ మ్యాచ్‌లో గిల్ ఈ రికార్డును తిరగరాశాడు. 269 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. 250 పరుగుల మార్క్‌ను తాకిన తొలి భారత బ్యాటర్‌గా గిల్ అరుదైన రికార్డు

మరోవైపు తన అద్భుతమైన ప్రదర్శనలతో, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో శుభ్‌మాన్ గిల్ టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుతున్న పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. “‘ఇది టెస్ట్ క్రికెట్ అని మనం గుర్తుంచుకోవాలి, మీరు ముందుగానే అవుట్ అయితే, మీరు బయట కూర్చోవలసి ఉంటుంది. మీరు క్రీజులో ఎంత ఎక్కువగా ఉంటే, మీరు అంత ఎక్కువ పరుగులు చేస్తారు. మీరు బయట కూర్చుని పరుగులు సాధించలేరు. కాబట్టి, నేను గాలిలో షాట్లు ఆడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నాకు వదులుగా ఉన్న బంతి దొరికితే తప్ప నేను గ్రౌండెడ్ షాట్లు ఆడటానికి ఎక్కువగా ప్రయత్నిస్తాను. నా అంతిమ లక్ష్యం భారతదేశం తరపున ఆడటం” అని శుభ్‌మన్ గిల్ వీడియోలో చెప్పుకొచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది