Rohit Sharma : రోహిత్ శర్మకు షాక్.. నెక్స్ట్ టీమిండియా కెప్టెన్ అతనే..?
Rohit Sharma : క్రికెట్ అభిమానులు అత్యంత అమితంగా ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. అయితే, ప్లే ఆఫ్స్ జాబితాలో ముంబై ఇండియన్స్ టీం లేకపోవడం ఐపీఎల్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. ఫైవ్ టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచి జట్టు, డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాకపోవడం పట్ల క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ప్రభావం ముంబై జట్టుపై కంటే కూడా కెప్టెన్‌గా రోహిత్ శర్మపై ఎక్కువ పడనుందని తెలుస్తోంది.కిందటి ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ సేనదే ఆధిపత్యం. కాగా ఈ సారి ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టేలకపోయింది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ సేన వరుస విజయాలు సాధించి సత్తా చాటింది.
మొత్తంగా ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచింది. ఓటమి అనేది అస్సలు చవి చూడలేదు. కానీ, ఈ సారి మాత్రం ఆ దూకుడును కనబరచలేకపోయింది. ఈ రిజల్ట్ ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు చేదు జ్ఞాపకమని పలువురు అంటున్నారు. త్వరలోనే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ పగ్గాలను అందుకుంటారని, టీ 20 ఇంటర్నేషనల్స్‌కు సారథ్యం వహిస్తారని అంచనా వేసుకున్నారు చాలా మంది. ముంబై ఇండియన్స్ టీంను సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఐదు సార్లు ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టినందుకుగాను రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా పగ్గాలను ఇవ్వాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.
Rohit Sharma : రోహిత్ శర్మపై తీవ్ర ప్రభావం..!
ఇకపోతే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తర్వాత తాను కెప్టెన్‌గా వైదొగలబోతున్నట్లు తన తర్వాత తన వారసుడిగా రోహిత్ శర్మను పేర్కొన్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చకపోవడం రోహిత్ శర్మ వైఫల్యమేనని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను పక్కనబెట్టి రిషభ్ పంత్‌ను టీమిండియాకు కెప్టెన్ చేయాలనే ప్రతిపాదన బీసీసీఐ ముందరకు వచ్చినట్లు వినికిడి. శ్రేయస్ అయ్యంగార్ గాయపడటంతో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకకరించిన రిషభ్ పంత్ జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు బాగా కష్టపడుతున్నాడు. అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ పేరు టీ20 పార్మాట్ కెప్టెన్సీకి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కెప్టెన్‌గా ఎవరిని సెలక్ట్ చేస్తుందో చూడాలి మరి..