IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ

 Authored By kranthi | The Telugu News | Updated on :14 October 2023,10:00 am

IND vs PAK : ప్రస్తుతం ప్రపంచమంతా ఆ ఒక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. అదే దాయాదుల పోరు. భారత్, పాకిస్థాన్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్ అది కూడా వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. రచ్చ రచ్చే కదా. అదే జరగబోతోంది ఈ మ్యాచ్ లో. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కానుంది. అసలే ఇది వన్ డే వరల్డ్ కప్. ఇక.. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే అస్సలు తగ్గేదేలే. కాకపోతే ఈ మ్యాచ్ లో ఒక్కటే వెలితి అని భారత్ క్రికెట్ అభిమానులు అనుకున్నారు. అదే శుభ్ మన్ గిల్. ఆల్ రౌండర్, ఓపెనర్ అయిన శుభ్ మన్ గిల్ కు డెంగ్యూ రావడంతో ఫస్ట్ రెండు మ్యాచ్ లు ఆడలేదు. చివరకు దాయాదుల పోరులో అయినా ఆడుతాడా అని అంతా అనుకున్నారు. చివరకు దాయాదుల పోరులో శుభ్ మన్ గిల్ ఆడుతున్నాడని, ఈ మ్యాచ్ తో వరల్డ్ కప్ లో బరిలోకి దిగుతున్నాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పేశాడు.

ఇది దాయాదుల పోరు కావడంతో ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ కొన్ని వేడుకలను కూడా నిర్వహిస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ సెలబ్రిటీలతో ఆటపాటలు నిర్వహించనున్నారు. డ్యాన్సులు గట్రా ప్లాన్ చేశారు. ఇది ఒక హై ఓల్టేజ్ మ్యాచ్. అందుకే.. ఈ మ్యాచ్ కోసం శుభ్ మన్ గిల్ కూడా అందుబాటులో ఉంటాడు. అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ మ్యాచ్ కు సిద్ధమయ్యాడు అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

shubman gill to play in world cup match against pakistan

#image_title

IND vs PAK : ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టిన శుభ్‌మన్ గిల్

ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకొని అక్కడ సాధన చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా జట్టుతో కలిసి శుభ్ మన్ గిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎలాగూ శుభ్ మన్ గిల్ కు ఈ స్టేడియం కొట్టిన పిండి కావడంతో ఈ మ్యాచ్ లో శుభ్ మన్ చెలరేగిపోవడం ఖాయం అని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుభ్ మన్ గిల్ కన్ఫమ్ అయితే.. ఇషాన్ కిషన్ ను ఈ మ్యాచ్ కు టీమిండియా పక్కన పెట్టనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది