Smaran Ravichandran : బాబోయ్ ఈ బ్యాట్స్‌మెన్ ముందు బౌలర్స్ తేలిపోయారుగా… టీమిండియా ఛాన్స్ పక్కా…!
ప్రధానాంశాలు:
Smaran Ravichandran : బాబోయ్ ఈ బ్యాట్స్‌మెన్ ముందు బౌలర్స్ తేలిపోయారుగా... టీమిండియా ఛాన్స్ పక్కా...!
Smaran Ravichandran : ఈ మధ్య ఇండియాకి India చెందిన యువ క్రికెటర్స్ Cricket అద్భుతంగా రాణిస్తున్నారు. ఐపీఎల్ IPL లో మంచి ప్రదర్శన కనబరిచి Team India టీమిండియా జట్టులో కూడా స్థానం సంపాదించుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా జరిగిన రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు స్మరన్ రవిచంద్రన్ Smaran Ravichandran . బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సీ మ్యాచ్‌లో కర్ణాటక తరుపున ఆడుతున్న స్మరన్.. Punjab పంజాబ్‌పై సెంచరీ సాధించాడు. 209 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సులు బాది 150 పరుగులు చేశాడు. ఇతగాడు విజయ్ హజారే ట్రోఫీలో కీలక ఇన్నింగ్స్ ఆడి అందరి ధృష్టిని ఆకర్షించాడు. ఎంతో ఆసక్తిగా సాగిన విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు కేవసం చేసుకుంది.
Smaran Ravichandran ఏం బ్యాటింగ్‌రా అయ్యా..
విదర్భా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు పూర్తి డామినేషన్ కనబర్చింది. ముందుగా టాస్ గెలిచిన విదర్భా.. బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 348 భారీ స్కోర్ నమోదు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటికీ.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన స్మరన్ రవిచంద్రన్ సెంచరీ సాధించి జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్‌లో 92 బంతుల్లో 101 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సులు) సాధించాడు. 21 ఏళ్ల స్మరన్ రవిచంద్రన్ కర్ణాటకు చెందిన క్రికెటర్. ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి.. తనదైన ముద్ర వేసుకున్నాడు.
స్మరన్ జర్నీ అంత ఈజీగా సాగలేదు. మొదట్లో కర్ణాటక సీనియర్ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డారు. సెలెక్టర్లు అతడిని అనేక సార్లు రిజెక్ట్ చేసినప్పటికీ పట్టుదలతో తన బ్యాటింగ్ క్వాలిటీని పెంచుకుంటూ నేడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఇంత అద్భుతంగా ఆడుతున్న స్మరన్‌ని ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో రవిచంద్రన్‌ను ఎవరూ కొనలేదు. దీంతో కాస్త నిరాశ చెందినట్లు కనిపిస్తోంది.కానీ, జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు స్మరన్ Smaran Ravichandran. ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి.. మంచి పెర్ఫామెన్స్ ఇస్తున్న స్మరన్ కచ్చితంగా టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకుంటాడని నెటిజన్స్ భావిస్తున్నారు.