Sachin Tendulkar : సౌరవ్ గంగూలీ చొరవ.. క్రికెట్ మైదానంలోకి మళ్లీ సచిన్ టెండూల్కర్.. !
Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గురించి తెలియని క్రీడాభిమానులు, భారతీయులు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన మైదానంలో ఉంటే చాలు.. ‘సచిన్ సచిన్ ’ అంటూ క్రికెట్ మైదానంలో ఆయన పేరు మర్మోగిపోతుంటుంది. క్రికెట్ గాడ్‌గా సచిన్ పూజించబడుతారు. క్రికెట్ రంగంలో అత్యున్నతమైన వ్యక్తిగా ఉన్న సచిన్ భయంకరమైన బ్యాట్స్ మెన్. ఆయన ఫీల్డ్‌లో ఉంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. ఆయన 2013లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఆనాటి నుంచి ఐపీఎల్ ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నప్పటికీ సచిన్ అంతగా ఫోకస్ పెట్టలేదు.
టీమిండియా మస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ త్వరలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. తోటి ఆటగాళ్లతో సచిన్ అడుగు పెడతారని అంటున్నారు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, ఎన్ సీఏ హెడ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. టీ 20 వరల్డ్ కప్ మెంటార్ గా ధోని ఉన్నారు. ఇలా క్రికెటర్స్ అందరూ కలిసి రావడానికి గంగూలీ వల్లే జరిగిందని అంటుంటారు. కాగా, ఈ క్రమంలోనే గంగూలీ చొరవతో సచిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి వస్తాడని తెలుస్తోంది.ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో గంగూలీ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈ వార్తలు బాగా వైరలవుతున్నాయి.
Sachin Tendulkar : క్రికెట్ అభిమానులకు త్వరలో గుడ్ న్యూస్..!
ఏదో ఒక రోజు సచిన్ లాంటి లెజెండరీ క్రికెటర్ సాయం టీమిండియాకు అవసరం అని అన్నారు. ఆ టైం కూడా త్వరలోనే వస్తుందని ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేశాడు. దాంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మళ్లీ మైదానంలోకి అడుగు పెడతారని క్రీడాభిమానులు, సచిన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందుకుగాను సచిన్ టెండుల్కర్‌ను ఒప్పించే బాధ్యత దాదా తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ, ఈ వార్తలు రావడంతో క్రీడాభిమానుల్లో జోష్ అయితే వచ్చింది.