SRH హెచ్చరిక .. సీఎం రేవంత్ రియాక్షన్..!
ప్రధానాంశాలు:
SRH హెచ్చరిక .. సీఎం రేవంత్ రియాక్షన్..!
SRH : ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad (SRH) మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య టికెట్ల వివాదం తీవ్రతరం అయ్యింది. SRH యాజమాన్యం, హెచ్‌సీఏపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అనుచిత ప్రవర్తనతో పాటు బెదిరింపులకు గురిచేసిందని పేర్కొంది. ఉచిత పాస్‌ల విషయంలో అసోసియేషన్ అధికారి జగన్మోహన్ రావు అనవసర ఒత్తిడి తీసుకువస్తున్నారని SRH జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ లేఖ ద్వారా వివరించారు. గత కొన్ని సీజన్లుగా హెచ్‌సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని SRH ఆరోపించింది.

SRH హెచ్చరిక .. సీఎం రేవంత్ రియాక్షన్..!
ఇది ఇలా కొనసాగితే హైదరాబాద్ నుంచి తమ జట్టు మారిపోయే అవకాశముందని హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 50 కాంప్లిమెంటరీ టికెట్లు అందజేస్తున్నామని కానీ దీనికంటే అధిక డిమాండ్ రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని SRH పేర్కొంది. హైదరాబాద్ జట్టును వదిలివెళతామని వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన రేపుతున్నాయి.
ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. SRH యాజమాన్యాన్ని హెచ్‌సీఏ బెదిరించిందనే ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె. శ్రీనివాస్ రెడ్డిని దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని సీఎం సూచించారు. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణలో అసోసియేషన్ దుర్వినియోగం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.