Sunil Gavaskar : కేఎల్ రాహుల్ వల్లే సెకండ్ టెస్టు ఓటమి.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
Sunil gavaskar : దక్షిణాఫ్రికాతో జరిగిన సెకండ్ టెస్టులో టీం ఇండియా ఓటమిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీ వల్లే ఇండియా ఓటమి పాలయ్యిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫీల్డింగ్ చాలా లూజ్ ఉందని, అదే దక్షిణాఫ్రికా జట్టు విజయానికి బూస్టప్ ఇచ్చిందన్నారు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వలన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ రెచ్చిపోయి ఆడాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా అతను రెండో టెస్టుకు దూరమయ్యాడని, దీంతో రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడని ఆయన తెలిపారు. అయితే, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా లేని ఒక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవ్వడం ఇదే ఫస్ట్ టైం అన్నారు. టీం ఇండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఎల్గర్ ఏమాత్రం ఒత్తిడికి గురవ్వలేదని, అందుకు మన ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమన్నారు. రాహుల్ చెత్త కెప్టెన్సీ వల్లే గెలిచి మ్యాచ్ కూడా ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక అర్థసెంచరీలతో రాణించిన టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేపై సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Sunil gavaskar : కోహ్లీ కెప్టెన్‌గా లేని ఒక్క మ్యాచ్..
పుజారా, రహానే ఇద్దరు మంచి ఆటగాళ్లు. గతంలో జట్టుకు అందించిన విజయాల నేపథ్యంలో మేనేజ్‌మెంట్ వారికి అండగా నిలిచింది. అవసరమైన టైంలో వారిద్దరూ రాణిస్తారనే నమ్మకం పెట్టుకుంది. అనుకున్నట్టుగానే వారు మంచి శుభారంభాన్ని అందించారు. సీనియర్లు విఫలమవుతున్న టైంలో ఒక్కోసారి బోర్డు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ఓవరాల్‌గా జట్టుకు మంచి ఫలితాన్ని అందించే ఆటగాళ్ల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తుంటారని సునీల్ గవాస్కర్ వెల్లడించారు. కాగా, వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించింది.