Suryakumar Yadav : కింద కూర్చొని అలవోక‌గా సిక్స‌ర్స్ కొడుతున్న సూర్య‌కుమార్ యాద‌వ్.. సీక్రెట్ ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suryakumar Yadav : కింద కూర్చొని అలవోక‌గా సిక్స‌ర్స్ కొడుతున్న సూర్య‌కుమార్ యాద‌వ్.. సీక్రెట్ ఇదే..!

Suryakumar Yadav : టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ బంతిని బౌండ‌రీన‌లి దాటించ‌డంలో దిట్ట‌. భారత టీ20 క్రికెట్ లోఆయ‌న ఇప్పుడొక సంచలనం. జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి ఏడాదే అవుతున్నా తన మార్క్ ఆటతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. టీ20ల్లో విధ్వంసకర ఆటతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సూర్య కుమార్ యాద‌వ్ విభిన్న షాట్లు ఆడుతూ టీమిండియా డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఇప్పటివరకు 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్య 187.43 […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,5:20 pm

Suryakumar Yadav : టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ బంతిని బౌండ‌రీన‌లి దాటించ‌డంలో దిట్ట‌. భారత టీ20 క్రికెట్ లోఆయ‌న ఇప్పుడొక సంచలనం. జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి ఏడాదే అవుతున్నా తన మార్క్ ఆటతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. టీ20ల్లో విధ్వంసకర ఆటతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సూర్య కుమార్ యాద‌వ్ విభిన్న షాట్లు ఆడుతూ టీమిండియా డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఇప్పటివరకు 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్య 187.43 స్ట్రైక్ రేట్ తో 1164 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు.

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ టీ20 మ్యాచ్‌లో చిచ్చరపిడుగల్లే చెలరేగిపోతున్నాడు. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించి వావ్ అనిపించాడు. కాగా టీ20ల్లో అతడికిది మూడో సెంచరీ. ఈ శతకంతో అతడి పేరుపై ఓ రికార్డు నమోదైంది. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కిన సూర్య కుమార్ యాద‌వ్ లిస్ట్‌లో రోహిత్ శర్మ కంటే ముందున్నాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకతోనే జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకం నమోదు చేయ‌గా, తాజాగా సూర్య 45 బంతుల‌లో సెంచ‌రీ కొట్టాడు.
మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం

Suryakumar Yadav reveals the secret of his great knock

Suryakumar Yadav reveals the secret of his great knock

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గేమ్‌కు సిద్ధం అవుతున్న‌ప్పుడు తనపై తాను ఒత్తిడి పెంచుకుంటానని అన్నాడు. మెరుగైన ప్రాక్టీస్ సెషన్ల కారణంగా నేను ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా. నేను ఆడిన షాట్‌లలో కొన్ని ముందుగా ఫిక్స్ అయినవే. నేను ఆడిన ఈ మ్యాచ్‌లో ఆడియన షాట్లే గత ఏడాది కాలంగా ఆడుతూ వ‌స్తున్నాను. అయితే వెనుక బౌండరీ తక్కువగా ఉండడంతో ఆ దిశగా షాట్లు కొట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. క్రీజ్‌లో ఉన్నప్పుడు రకరకాల షాట్లు ఆడేందుకు చాలా సిద్ధంగా ఉండాలి. గ్యాప్‌ని దృష్టిలో ఉంచుకుని ఫీల్డ్‌కు అనుగుణంగా షాట్‌లు ఆడుతున్నాను. కోచ్ నా ఆట ఆడేందుకు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు.. అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది