India Vs Bangladesh : ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై భారత్ గెలుపు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India Vs Bangladesh : ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై భారత్ గెలుపు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :2 November 2022,6:01 pm

India Vs Bangladesh : T20 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ 1లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన భారత్ … బంగ్లాకు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మొదటి నుండి దూకుడుగానే ఆడింది.

ఏడు ఓవర్ లు పూర్తి అయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇక ఎనిమిదో ఓవర్ ప్రారంభం అవుతుండగా ఒక్కసారిగా వర్షం పడటంతో మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఆ తర్వాత మళ్ళీ వరనుడు కరుణించటంతో. .. నాలుగు ఓవర్లు తగ్గించి.. 9 ఓవర్లలో బంగ్లాదేశ్.. 85 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.

T20 World Cup 2022 India wins against Bangladesh

T20 World Cup 2022 India wins against Bangladesh

ఈ క్రమంలో వర్షం పడిన తర్వాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు లక్ష్యాన్ని చేదించడంలో ఒత్తిడికి గురికావడం జరిగింది. దీంతో వర్షం పడిన తర్వాత ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత అదే రీతిలో ఒత్తిడిలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మేన్స్ వెనుదిరిగారు. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 151 లక్ష్యాన్ని చేధించలేక 145 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో  బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. దీంతో భారత్ గెలిచి…సెమిస్ లోకి వెళ్లి గ్రూప్ వన్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది