T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. పాక్‌తో సమరం ఎప్పుడో తెలుసా?
T20:క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసింది. ఈ వరల్డ్‌కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 మధ్య జరగనుంది. మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 9న తొలి సెమీఫైనల్ ఉండగా.. నవంబర్ 10న రెండో సెమీఫైనల్, నవంబర్ 13న ఫైనల్ జరుగుతాయి.ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా తమ వేటను పాకిస్థాన్‌తోనే మొదలు పెట్టనుంది భారత్. సూపర్ 12 దశలో తొలి మ్యాచ్‌లో గత వరల్డ్‌కప్ ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
ఈ వరల్డ్‌కప్ నాకౌట్ స్టేజ్‌లో జరగనుంది. సూపర్ 12లో 12 జట్లు తలపడతాయి. ఇందు కోసం ఇప్పటికే 8 జట్లు టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా సూపర్ 12కు అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం తొలి రౌండ్‌లో ఆయ జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీసి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.అక్టోబర్ 16 నుంచి 21 మధ్య తొలి రౌండ్ పోటీలు జరగనుండగా.. 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 6న ముగుస్తాయి. సూపర్ 12 మ్యాచ్‌లను రెండు గ్రూపులగా విడదీసి నిర్వహించనున్నారు. గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ A విజేత, గ్రూప్ B రన్నరప్ ఉండనున్నాయి.
T20 world Cup : పాక్ తో సమరం ఎప్పుడో తెలుసా?
ఇక గ్రూపు 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ B విజేత, గ్రూప్ A రన్నరఫ్ ఉండనున్నాయి.ఆస్ట్రేలియాలోని మొత్తం 7 వేదికలలో 2022 టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. తొలి రౌండు పోటీలకు గీలాంగ్, హోబర్ట్ మైదానాలు వేదికలుగా నిలవనున్నాయి. ఇక సూపర్ 12, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, సిడ్నీ, మెల్‌బోర్న్ వేదికలుగా నిలవనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.