Team India : సిగ్గులేని పని చేసిన శ్రీలంక.. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించిన టీమిండియా..!!
Team India : 2023లో భారత్ … శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ మొదలు పెట్టగా, టీ 20 సిరీస్‌లో భారత్ 2-1తో మ్యాచ్ గెలిచింది. ఇక నిన్న తొలి వన్డే జరగగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయంతో గెలిచింది.గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక అజేయ శతకంతో పోరాడిన శ్రీలంక కెప్టెన్ షనక.. ఓటమి అంతరాన్ని భారీగా తగ్గించాడు. ఈ మ్యా్చ్‌లో కోహ్లి శతకం, షనక పోరాటానికి మించి.. రోహిత్ శర్మ కనబర్చిన క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ఇదే వాళ్లకు మనకు తేడా.. తాజా మ్యాచ్‌లో దసున్ షనక 37.5 ఓవర్లలో 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక మరో వికెట్ కోల్పోకుండా 50 ఓవర్లపాటు ఆడి.. 306 పరుగులు చేసింది.
మొదట్లో నెమ్మదిగా ఆడిన షణక తర్వాత దూకుడు పెంచాడు. 49వ ఓవర్లో 95 పరగులకు చేరుకున్న అతినికి ఆఖరి ఓవర్లో మరో ఐదు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుంది. తొలి బంతికి రెండు పరుగులు తీసిన షనక.. మూడో బంతికి సింగిల్ తీశాడు. దీంతో షనకకు మళ్లీ స్ట్రైకింగ్ రాకుండా చూకుండా చూడటం కోసం రోహిత్ శర్మ ఫీల్డర్లను చాలా దగ్గరగా మోహరించాడు. అయితే అదే సమయంలో బౌలర్ షమీ.. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న లంక కెప్టెన్‌ను రనౌట్ (మన్కడింగ్) చేశాడు. అనంతరం ఔట్ కోసం అప్పీల్ చేయగా.. రోహిత్ శర్మ జోక్యం చేసుకొని అప్పీల్‌ను వెనక్కి తీసుకునేలా చేశాడు . హిట్ మ్యాన్ చొరవ, అతని మంచితనం కారణంగా బతికిపోయిన షనక.. ఐదో బంతికి ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే శ్రీలంక టీమ్ మాత్రం టీమిండియాకు ఒకానొక సమయంలో ఘోరమైన అన్యాయం చేసింది.
ఏ మాత్రం క్రీడా స్ఫూర్తి చూపించకుండా.. సిగ్గులేకుండా నో బాల్‌తో సెహ్వాగ్ సెంచరీకి అడ్డుపడింది. 2010లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 170 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈ టార్గెట్‌ను టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఒంటిచేత్తో ఊదిపడేయగా, చివరలో విజయానికి 5 పరుగులు అవసరమైన సమయంలో సెహ్వాగ్ 99 రన్స్‌తో స్ట్రైక్‌లో ఉన్నాడు. అయితే లంక బౌలర్ సూరజ్ రణ్‌దీవ్ మాత్రం.. టీమిండియా పాలిట విలన్ అయ్యాడు. అందుకు కారణం సెహ్వాగ్ 99పైనే ఉంచాలని ఆ నో బాల్‌ను రణ్‌దీప్ కావాలనే వేసినట్లు అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం సెహ్వాగ్‌కు సారీ చెప్పి.. రణ్‌దీప్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. శ్రీలంక చేసిన చెత్త పనిని క్షమించిన టీమిండియా క్రీడా స్పూర్తి ప్రకటించిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.