IND VS Srilanka : ఇది కదా మ్యాచ్ అంటే.. శ్రీలంక చిత్తు.. 302 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.. సెమీస్‌కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్‌గా రికార్డు
ప్రధానాంశాలు:
సెమీ ఫైనల్స్ కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా భారత్ రికార్డు
సొంత గడ్డపై భారత జైత్రయాత్ర
ఎదురులేని భారత్
IND VS Srilanka : అన్ని క్రికెట్ మ్యాచ్ లు ఒకే రకంగా ఉండవు. చాలా అరుదుగా కొన్ని మ్యాచ్ లు జరుగుతుంటాయి. అలాంటి మ్యాచ్ లలో ఈ మ్యాచ్ ఒకటి. అదే భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్. అవును.. అసలు ఇది మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇక్కడ వార్ వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఒక్కడి 357 పరుగులు.. ఎక్కడి 55 పరుగులు. శ్రీలంక కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లు నష్టపోయి 357 పరుగులు చేసి.. శ్రీలంకకు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. శ్రీలంక మాత్రం ఆవేశపడి 20 ఓవర్లు కూడా ఆడకుండా వికెట్లు అన్నీ పోగొట్టేసుకుంది. దీంతో 55 పరుగులతోనే శ్రీలంక సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ లో చేరిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో సెమీస్ కు ఏ టీమ్ వెళ్లలేదు. సెమీస్ కు అర్హత సాధించిన తొలి టీమ్ గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 92 పరుగులు చేసి సెంచరీ దగ్గరికి వచ్చి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా సెంచరీకి దగ్గరికి వచ్చి 88 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రెయాస్ అయ్యర్ 82, రవీంద్ర జడేజా 35, కేఎల్ రాహుల్ 21, సూర్యకుమార్ యాదవ్ 1, షమీ 2, రోహిత్ శర్మ 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మదుషంక 5 వికెట్లు తీశాడు. దుష్మంత ఒక వికెట్ తీశాడు. ఇక శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంటే కాసున్ రజిత్ 14 పరుగులు, మహీశ్ తీక్షణ 12 పరుగులు, మాథ్యూస్ 12 పరుగులు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ డకవుట్ అయ్యారు. ఇక.. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. 5 వికెట్లు తీసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
???????????????? ???????????? ????????????????????! ????#TeamIndia ???????? becomes the first team to qualify for the #CWC23 semi-finals ????????#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023
Mohammed Shami is the @aramco #POTM for his incisive spell which bowled out Sri Lanka for a paltry total ????#CWC23 | #INDvSL pic.twitter.com/GncH9zK8yE
— ICC (@ICC) November 2, 2023
A record win at Wankhede helps India qualify for the semi-final stage of the #CWC23 ????#INDvSL????: https://t.co/BtA9m9MDWT pic.twitter.com/e5aTueJHls
— ICC (@ICC) November 2, 2023
SEMI-FINALS ????
India have booked their berth for the #CWC23 knockouts ???? pic.twitter.com/Q0UVffp6iY
— ICC (@ICC) November 2, 2023