India VS Australia : ఓవర్ కాన్ఫిడెన్స్, స్లో బ్యాటింగే టీమిండియా ఓటమికి కారణమా.. 30 ఓవర్లలో రెండే బౌండరీలు.. ఫైనల్‌లో ఇలా ఆడతారా ఎవరైనా?
India VS Australia : ఇది ఓవర్ కాన్ఫిడెన్సా? లేక స్లో బ్యాటింగా? డ్యూ ఫ్యాక్టరా? టాస్ ఓడిపోవడమా? అసలు.. ఐసీసీ వరల్డ్ కప్ లో ఏం జరిగింది. అసలు సొంత గడ్డ మీద లక్షల మంది ఇండియన్స్ ముందు ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీని ఎగురవేసుకుపోయింది అంటే మాటలా? ఈ విషయంలో ఆస్ట్రేలియా టీమ్ ను ఒప్పుకోవాలి కానీ.. లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చిన […]
ప్రధానాంశాలు:
భారత్ ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా
ఫైనల్ మ్యాచ్ లో చతికిలపడ్డ భారత్
టీమిండియాకు ఘోర అవమానం ఇది
India VS Australia : ఇది ఓవర్ కాన్ఫిడెన్సా? లేక స్లో బ్యాటింగా? డ్యూ ఫ్యాక్టరా? టాస్ ఓడిపోవడమా? అసలు.. ఐసీసీ వరల్డ్ కప్ లో ఏం జరిగింది. అసలు సొంత గడ్డ మీద లక్షల మంది ఇండియన్స్ ముందు ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీని ఎగురవేసుకుపోయింది అంటే మాటలా? ఈ విషయంలో ఆస్ట్రేలియా టీమ్ ను ఒప్పుకోవాలి కానీ.. లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో మాత్రం చతికిలపడింది. అసలు టాస్ ఓడిపోవడమే పెద్ద తప్పు అని అందరూ అంటున్నారు. అసలు తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ చేసిన పరుగులు ఎన్ని 240 మాత్రమే. సరే.. 10 ఓవర్ల వరకు భారత్ చేసిన స్కోర్ ఎంత.. 80 పరుగులు. మరి.. 10 ఓవర్ల నుంచి 40 ఓవర్ల వరకు చూసుకుంటే స్కోర్ ఏమాత్రం పెరగలేదు. అసలు 10 నుంచి 40 ఓవర్ల లోపు అంటే 30 ఓవర్లలో భారత్ బ్యాట్స్ మెన్లు ఎందుకు రాణించలేకపోయారు. 30 ఓవర్లలో కొట్టిన బౌండరీలు రెండు మాత్రమే. ఇక.. స్కోర్ ఎందుకు పెరుగుతుంది.
పోనీ.. చివరి 10 ఓవర్లలో అయినా టీమిండియా రాణించిందా అంటే అదీ లేదు. చివరి 10 ఓవర్లలో టీమిండియా చేసిన పరుగులు 43 మాత్రమే. అందులోనూ 5 వికెట్లు కోల్పోయింది. ఇలా.. అడుగడుగునా టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు మ్యాచ్ లో కనిపించింది. ఫైనల్ మ్యాచ్ లో ఇంత స్లో బ్యాటింగ్ చేయడం ఏంటి.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్టుగా.. అన్ని మ్యాచ్ లు గెలిచి చివరకు ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం అనేది టీమిండియాకు భారీ దెబ్బ అనే చెప్పుకోవాలి. టీమిండియా రాణించింది అంటే.. ముందు 10 ఓవర్లలో మాత్రమే. అప్పుడే 80 పరుగులు చేయగలిగింది.
India VS Australia : ఫైనల్ లో ఆడాల్సిన ఆట ఆడని భారత్
మొత్తానికి ఫైనల్ మ్యాచ్ లో ఆడాల్సిన మ్యాచ్ అయితే ఇది కాదు. టాస్ ఓడిపోవడం వల్ల భారత్ ఓడిపోయింది అంటున్నారు. ఇదివరకు ఇదే స్టేడియంలో టాస్ ఓడిపోయి భారత్ గెలిచిన మ్యాచ్ లు చాలా ఉన్నాయి కదా. ముందు బ్యాటింగ్ చేసి భారత్ గెలిచిన మ్యాచ్ లు ఉన్నాయి కదా. డ్యూ ఫ్యాక్టర్ అని కొందరు చెబుతున్నరు.. డ్యూ ఫ్యాక్టర్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలోనూ ఉన్నాయి కదా. మరి ఆ మ్యాచ్ లలో గెలిచినప్పుడు ఈ మ్యాచ్ లో మాత్రమే డ్యూ ఫ్యాక్టర్ ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు.. అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. వాళ్ల స్లో బ్యాటింగ్ కావచ్చు.. టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు.. అన్నీ కలుపుకొని సొంత గడ్డపై చేజేతులారా వరల్డ్ కప్ ట్రోఫీని టీమిండియా చేజార్చుకుందనే చెప్పుకోవాలి.