IPL SRH : ఉప్పల్ స్టేడియంకి ఒక్క మ్యాచ్‌కు SRH ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL SRH : ఉప్పల్ స్టేడియంకి ఒక్క మ్యాచ్‌కు SRH ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  ఐపీఎల్ మ్యాచ్‌లు బీసీసీఐ కి ఎలాంటి సంబంధం లేదా..?

  •  IPL SRH : ఉప్పల్ స్టేడియంకి ఒక్క మ్యాచ్‌కు SRH ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..?

IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ Indian Premier League  (ఐపీఎల్) దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన Cricket క్రికెట్ లీగ్. అయితే చాలా మంది ఐపీఎల్ నిర్వహణ, స్టేడియంలకు సంబంధించి తెలియని నిజాల గురించి ఇటీవల హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఛైర్మన్ వెల్లడించిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు బీసీసీఐ లేదా ప్రాంతీయ క్రికెట్ బోర్డుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని అనుకుంటాం. కానీ వాస్తవంగా ఐపీఎల్ పూర్తిగా స్వతంత్రంగా నడిచే లీగ్. ఈ లీగ్‌కు బీసీసీఐ లేదా హెచ్‌సీఏ వంటి ప్రాంతీయ బోర్డుల చట్టపరమైన సంబంధం లేదని హెచ్‌సీఏ ఛైర్మన్ స్పష్టం చేశారు.

IPL SRH ఉప్పల్ స్టేడియంకి ఒక్క మ్యాచ్‌కు SRH ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా

IPL SRH : ఉప్పల్ స్టేడియంకి ఒక్క మ్యాచ్‌కు SRH ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..?

IPL SRH ఐపీఎల్ గురించి చాలామందికి తెలియని విషయాలు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ హోమ్ మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే ఈ స్టేడియాన్ని SRH యాజమాన్యం ప్రతి మ్యాచ్‌కు రూ. 1.5 కోట్ల అద్దెకు తీసుకుంటుందని హెచ్‌సీఏ ఛైర్మన్ తెలిపారు. అంటే ఒక సీజన్‌లో 7 హోమ్ మ్యాచ్‌లు ఆడే SRH మొత్తం రూ. 10.5 కోట్లు హెచ్‌సీఏకు చెల్లిస్తుంది. స్టేడియాన్ని అద్దెకు ఇచ్చిన తర్వాత, టికెట్ అమ్మకాలు, మ్యాచ్ నిర్వహణ, ప్రేక్షకుల కోసం సౌకర్యాలు అందించడానికి పూర్తి బాధ్యత SRH యాజమాన్యానిదే. హెచ్‌సీఏ మాత్రం కేవలం స్టేడియాన్ని అద్దెకు ఇచ్చే బాధ్యతను మాత్రమే నిర్వహిస్తుంది.

ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఐపీఎల్ నిర్వహణలో ప్రాంతీయ క్రికెట్ సంఘాలకు పెద్దగా సంబంధం లేదని స్పష్టమవుతోంది. చాలా మంది బీసీసీఐ లేదా హెచ్‌సీఏ వంటి బోర్డులు మ్యాచ్‌ల నిర్వహణలో ప్రమేయం ఉంటాయని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా స్టేడియంను అద్దెకు తీసుకుని, తమ సొంత నిర్వహణలో మ్యాచ్‌లు నిర్వహిస్తాయి. ఇది ఐపీఎల్ లీగ్ నడిపే విధానం గురించి కొత్త అవగాహనను ప్రజలకు అందించేదిగా మారింది. హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌ల గురించి తెలియని ఈ నిజం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది