IPL : ఒకే ఓవర్ వేసిన ఇద్దరు బౌలర్స్.. భలే విచిత్రంగా ఉందిగా..!
IPL : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. గత రాత్రి గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరగగా, అందులో తొలిసారి ఇద్దరు బౌలర్లు ఒకే ఓవర్‌లో చెరు మూడు బంతులు పంచుకున్నారు. మ్యాచ్ పదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రాహుల్ చాహర్ వరుసగా మొదటి మూడు బంతులు వేయగా.. ఆ తర్వాతి మూడు బంతులను లివింగ్ స్టోన్ బౌలింగ్ చేశాడు. అయితే, రాహుల్ చాహర్ ఇలా బేబీ ఓవర్‌తో వెనుదిరగడానికి అసలు కారణం వేరే ఉంది. పంజాబ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను పవర్ ప్లేలో కాకుండా సెకండ్ స్పెల్‌లో బౌలింగ్ చేయించాలని కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అనుకున్నాడు.
ఈ క్రమంలో పదో ఓవర్‌లో చాహర్ బౌలింగ్‌కి వచ్చాడు. మొదటి బంతిని డాట్‌గా వేయగా.. రెండో బంతికి సుదర్శన్ రెండు పరుగులు తీశాడు. ఆ సమయంలో నాన్ స్ట్రయిక్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ నెమ్మదిగా పరిగెత్తడంతో ఫీల్డర్ వేగంగా బంతిని చాహర్ వైపు విసిరాడు. మిల్లర్‌ని రనౌట్ చేద్దామనే ప్రయత్నంలో వేగంగా వచ్చిన బంతి చాహర్ చేతి వేళ్లను బలంగా తాకింది. మూడో బంతిని వేసిన చాహర్.. ఆ తర్వాత బౌలింగ్ చేయలేక ఓవర్ మధ్యలోనే డగౌట్ వైపు పరుగులు తీశాడు. దాంతో లివింగ్ స్టోన్ మిగతా మూడు బంతులు వేయాల్సి వచ్చింది.
IPL : భలేగుందిగా..
ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే వరకూ మళ్లీ చాహర్ గ్రౌండ్‌లోకే అడుగుపెట్టలేదు.వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది పంజాబ్. అద్భుత బౌలింగ్‌తో హార్ధిక్ సేనను 143 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్.. ఆ టార్గెట్‌ను 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. దాంతో పంజాబ్ కింగ్స్‌కు ఐదో విజయం దక్కగా.. గుజరాత్ రెండో ఓటమిని ఎదుర్కొంది. గుజరాత్‌పై విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌లో సెటిల్ అయింది. ఈ మ్యాచ్‌కి ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదికైంది.